అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?

TVK Vijay: తమిళనాడు సీఎం కావాలని ఆశపడుతున్న విజయ్‌కు ఇప్పుడు వ్యక్తిగత వివాదం పెను సమస్యగా మారుతోంది. ఇలాంటి సమస్యలన్నీ రాజకీయాల్లోకి రాక ముందే పరిష్కరించుకుని ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది.

Vijay personal controversy become political agenda:   వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలిగి, ఇప్పుడు తమిళనాడు రాజకీయ పీఠాన్ని అధిరోహించాలని ఆశపడుతున్న విజయ్  కి ఊహించని షాక్ తగిలింది. వివాహేతర సంబంధం ఆరోపణలు చేస్తూ ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు  పెను సంచలనంగా మారింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందే ఇలాంటి సున్నితమైన అంశాలను పరిష్కరించుకోవాల్సింది పోయి, వాటిని వివాదస్పదం చేసుకోవడం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ముందే తుడిచేసుకోవాల్సిన  మచ్చ.. ఇప్పుడు రచ్చ! 

రాజకీయాల్లోకి వచ్చే ఏ నాయకుడైనా తన వ్యక్తిగత జీవితం ఓపెన్ బుక్  అని తెలుసుకోవాలి. విజయ్ విషయంలో విడాకుల అంశం ఇప్పుడు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేలా పరిణమించింది. ఒక స్టార్ హీరోగా ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలు ప్రైవేట్‌గా ఉండే అవకాశం ఉంటుంది కానీ, ప్రజాక్షేత్రంలోకి వచ్చాక ప్రతి చిన్న విషయం చర్చనీయాంశమవుతుంది. రాజకీయ రంగప్రవేశానికి ముందే తన కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుని ఉంటే, ఇప్పుడు ఆయన సిద్ధాంతాలపై చర్చ జరిగేది. కానీ, ఇప్పుడు చర్చ అంతా ఆయన వ్యక్తిగత సంబంధాల చుట్టూనే తిరుగుతోంది.

ప్రచార అస్త్రంగా మార్చుకోనున్న ప్రత్యర్థులు 

తమిళనాడు రాజకీయాలు అత్యంత కఠినమైనవి. ఇక్కడ భావోద్వేగాల కంటే వ్యక్తిత్వ హననం  రాజకీయాలు వేగంగా పనిచేస్తాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీలు విజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఈ విడాకుల అంశాన్ని, సదరు హీరోయిన్‌తో ఉన్నట్లు చెప్తున్న సంబంధాన్ని  పద్ధతిగా  వాడుకునే అవకాశం ఉంది. ప్రజల్లో ఆయనకున్న  ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్‌ను డీగ్రేడ్ చేయడం ద్వారా ఆయన నైతికతను ప్రశ్నించే వ్యూహానికి ప్రత్యర్థులు పదును పెడుతున్నారు.  ప్రస్తుతం విజయ్ ఈ అంశంపై మౌనంగా ఉండటం వల్ల ఊహాగానాలు మరింత ముదురుతున్నాయి. రాజకీయంగా ఆయన తన విధానాలను వివరించడం కంటే, వ్యక్తిగత ఆరోపణలకు సమాధానం చెప్పుకోవడానికే సమయం సరిపోయేలా ఉంది. ఈ వ్యవహారం ఇంకా రచ్చ కాకముందే విజయ్ ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకోవడమో లేదా పారదర్శకమైన వివరణ ఇవ్వడమో చేయకపోతే, ఆయన పార్టీ పెట్టబోయే సభల్లో విజన్  కంటే వివాదాల కే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.

 విధానాల కంటే వ్యక్తిత్వమే చర్చగా మారితే ప్రమాదం 

ఒక కొత్త పార్టీకి ప్రారంభంలో ప్రజల్లో కలిగే  మొదటి అభిప్రాయం చాలా ముఖ్యం. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడినా, మీడియా ,  ప్రత్యర్థులు మాత్రం ఆయన రిలేషన్ షిప్ గురించే ఫోకస్ చేసే ప్రమాదం ఉంది. ఇది ఒక రకంగా ఆయన రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది.  విజయ్ తన రాజకీయ నౌకను సురక్షిత తీరానికి చేర్చాలంటే, వెంటనే ఈ వ్యక్తిగత వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి. ఎంత త్వరగా ఈ సమస్యను సెటిల్ చేసుకుంటే, అంత త్వరగా ఆయన మళ్లీ ప్రజల అజెండాపై దృష్టి పెట్టగలరు. లేనిపక్షంలో, దళపతి రాజకీయ ప్రయాణం మొదలవ్వక ముందే అడ్డంకులతో నిండిపోయే అవకాశం ఉంది.            


 

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget