అన్వేషించండి

Vijay Sangeetha Divorce: నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?

Vijay Sangeetha Divorce Reason: తమిళ కథానాయకుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఈ డివోర్స్ వెనుక కారణం ఎవరు? అంటే...

టీవీకే పార్టీ (TVK Vijay) వ్యవస్థాపకుడు, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకులలో ఒకరు, దళపతి విజయ్ (Thalapathy Vijay) నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత (Vijay Wife Sangeetha) కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చిత్ర పరిశ్రమతో పాటు తమిళ, దేశ రాజకీయాల్లో ఈ వార్త సంచలనమైంది. అసలు, విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఏమిటి? కోర్టుకు తెలిపిన వివరాల్లో ఏముంది? అనేది చూస్తే...

నటితో విజయ్ అక్రమ సంబంధం!
దక్షిణాది చిత్రసీమలోని కథానాయిక త్రిషతో విజయ్ (Vijay Trisha Relationship)కు సంబంధం ఉందని తమిళ రాజకీయాల్లో కొందరు బాహాటంగా విమర్శలు చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. క్షమాపణలు చెప్పారు. అయితే... ఇప్పుడు విజయ్ భార్య దాఖలు చేసిన డివోర్స్ పిటీషన్ చూస్తే? విజయ్ - త్రిష బంధంపై పరోక్ష విమర్శలు చేశారని చెప్పవచ్చు.

ఏప్రిల్ 2021లో నటితో విజయ్ అక్రమ / వివాహేతర సంబంధం నడుపుతున్నట్టు తన దృష్టికి వచ్చినట్టు సంగీత విజయ్ తెలిపారు. ఆ తర్వాత తాను తీవ్ర మానసిక వేదనకు గురి అయ్యానని, వివాహ బంధం / నమ్మకంలో తాను మోసపోయానని ఆవిడ వివరించారు. వివాహేతర సంబంధానికి ముగింపు పలుకుతానని తొలుత విజయ్ మాట ఇచ్చినప్పటికీ... దాన్ని కొనసాగిస్తూ తనను మరింత మానసిక వేదనకు గురి చేశారని ఆరోపించారు.

నన్ను దూరం పెట్టి నటితో షికార్లు!
సెప్టెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్యలో కౌన్సిల్ ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించానని, కానీ సఫలం కాలేదని కోర్టుకు సంగీత విజయ్ వివరించారు. తన నుంచి దూరంగా జరగడంతో పాటు నటితో కలిసి విజయ్ విదేశాలకు వెళ్లారని, షికార్లు చేశారని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి (విజయ్ - త్రిష) ఫోటోలు వైరల్ అవ్వగా, వాళ్ళిద్దరి సంబంధం గురించి కథనాలు రాగా... వాటిని ఖండించకుండా పరోక్ష అంగీకారం తెలపడం వల్ల తనకు, పిల్లలకు ఎంతో అవమానంగా అనిపించిందని సంగీత చెప్పారు. 

Also Readరష్మికతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమలో పడలేదు, పెళ్ళీ చేసుకోలేదు... ఇంకా ఒంటరిగా రక్షిత్ శెట్టి?

త్రిష పేరును పిటీషన్‌లో సంగీత ఎక్కడా పేర్కొనలేదు. కానీ ఆవిడకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టును కోరారు. ఆగస్టు 2024 - ఫిబ్రవరి 2025 మధ్య ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదని ఆవిడ తెలిపారు. పైగా, తనకు ఆర్థికపరమైన పరిమితులు విధించడంతో పాటు తన స్వేచ్ఛకు విజయ్ సంకెళ్లు వేశారని సంగీత చెప్పారు. ఈ తరుణంలో విజయ్ తో వైవాహిక సంబంధంలో కొనసాగలేనని, తనకు విడాకులు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశారు. కెమెరా కనుసన్నలలో విచారణ జరగాలని కోరారు.

Also ReadVishnu Vinyasam Review - 'విష్ణు విన్యాసం' రివ్యూ: శ్రీవిష్ణు సినిమా హిట్టేనా? కామెడీ బావుందా? లేదా?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
Embed widget