అన్వేషించండి

KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!

KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు, పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాళేశ్వరం బ్యారేజీల లోపాలపై కమిషన్ ఏర్పాటును కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు.
  • కనీస విధివిధానాలు పాటించకుండానే తనను దోషిగా ప్రకటించారని కేసీఆర్ వాదించారు.
  • నివేదికను రాజకీయ లక్ష్యంతోనే బహిర్గతం చేశారని పిటిషనర్లు ఆరోపించారు.
  • తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది.

KCR Petition: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఉదంతం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, డిజైన్ వైఫల్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ తీరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కమిషన్ నివేదికను, దాని ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 

ఏ ప్రాతిపదికన బాధ్యుడిని చేస్తారు?

ప్రాజెక్టు ప్రణాళిక, డిజైనింగ్, నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని జస్టిస్ ఘోష్ కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్దారించిందో చెప్పాలని కేసీర్ హైకోర్టును కోరారు. కేవలం ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగా ఒక తుది నిర్ణయానికి రావడం సరికాదని, దానికి సంబంధించిన ఆధారాలను తన ముందు ఉంచి, తన వివరణ తీసుకున్న తర్వాతే కమిషన్ ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రక్రియలో కనీస విధివిధానాలు పాటించలేదని ధర్మాసనానికి నివేదించారు. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమారు సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్ధీన్‌తో కూడిన ధర్మానసనం ఈ విచారణను చేపట్టింది. కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీష్‌రావు, ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్‌ ఎస్‌కే జోషి కూడా కమిషన్ ఏర్పాటు సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. 

సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారించడమేంటీ?

కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ కమిషన్ విచారణ ప్రక్రియలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. కమిషన్ చట్టంలోని సెక్షన్ 5 కింద కేసీఆర్‌కు నోటీసు ఇచ్చి, ఒక సాక్షిగా విచారణకు రావాలని పిలిచారని, కానీ నివేదికలో మాత్రం ఆయనను నేరుగా దోషిగా చెప్పారని పేర్కొన్నారు. ప్రాజెక్టు స్థల మార్పు  సలహాలను పట్టించుకోలేదని, డిజైన్ నుంచి టెండర్ల వరకు అన్నింటికీ కేసీఆరే బాధ్యుడని కమిషన్ నిర్దారించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి 7,500 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని కమిషన్‌ నివేదికలో పేర్కొందని వివరించారు. ఒక వ్యక్తి ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే అంశాలు ఉన్నప్పుడు సెక్షన్ 8బి, సీ ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని, కానీ ఇక్కడ అది జరగలేదని వాదించారు. తనపై ఎవరూ ఆరోపణలు చేశారో చెప్పలేదని, ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం కూడా ఇవ్వలేదని వివరించారు. 

రాజకీయ లక్ష్యంతోనే సంక్షిప్త నివేదిక 

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని అంశాలను సరి చూసుకోకుండానే కొందరు అధికారులు ఒక బృందంగా ఏర్పడి 60పేజీల నివేదికను తయారు చేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆరోపించారు. ఈ నివేదికను కేవలం రాజకీయంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ద్వారా మీడియాకు వెల్లడించారని పేర్కొన్నారు. విచారణ కమిషన్ నివేదికను నేరుగా అసెంబ్లీలో చర్చించకుండా పిటిషనర్లు కనీసం కాపీ ఇవ్వకుండా బహిర్గతం చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అందుకే కమిషన్‌ను, నివేదికను రద్దు చేయాలని కోరారు. 

పిటిషనర్ల తరఫున వాదనలు పూర్తి కావడంతో, ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సి ఉంది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినందున ఈ పిటిషన్లపై విచారణ అవసరం లేదన్న వాదన కేసిఆర్ తరఫున న్యాయవాదులు తోసిపుచ్చారు.     

Frequently Asked Questions

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి కేసీఆర్ పిటిషన్ ఎందుకు వేశారు?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్ వైఫల్యాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, దాని ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ తనను ఏ ప్రాతిపదికన బాధ్యుడిగా చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు?

ప్రాజెక్టు ప్రణాళిక, డిజైనింగ్, నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్ధారించిందో చెప్పాలని కేసీఆర్ కోరారు.

కమిషన్ విచారణ ప్రక్రియలో కేసీఆర్ తరఫు న్యాయవాదులు ఎటువంటి లోపాలను ఎత్తి చూపారు?

కేసీఆర్ ను సాక్షిగా పిలిచి, నివేదికలో మాత్రం నేరుగా దోషిగా పేర్కొన్నారని, ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, వివరణ తీసుకోలేదని వాదించారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక వెనుక రాజకీయ లక్ష్యం ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎందుకు ఆరోపించారు?

ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా మీడియాకు వెల్లడించారని, రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ నివేదిక తయారు చేయబడిందని ఆరోపించారు.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget