అన్వేషించండి

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!

Gen Z Social Media Campaign: భారత రాజకీయాల్లో డిజిటల్ విప్లవం. ఫేస్‌బుక్, ఎక్స్‌లను దాటి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ వైపు మళ్లిన నాయకులు. జెన్ జీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తప్పట్లేదు.

Shorts Reels Political Algorithm: దేశంలో ఎన్నికల ప్రచార శైలి మునుపెన్నడూ లేనంత వేగంగా మారుతోంది. ఒకప్పుడు వార్తాపత్రికల ప్రకటనలు, ప్రెస్ మీట్లతో ప్రారంభమై, ఆ తర్వాత ఫేస్‌బుక్ ఐటీ సెల్స్, ఎక్స్  హాష్ టాగ్ వార్స్ వైపు మళ్లిన పొలిటికల్ డిజిటల్ క్యాంపెయినింగ్.. ఇప్పుడు సరికొత్తగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్  , యూట్యూబ్ షార్ట్స్  చుట్టూ తిరుగుతోంది. ప్రతిపక్షాలు, పాలక పక్షాలనే తేడా లేకుండా ప్రధాన పార్టీల సీనియర్ నేతల నుంచి యువ నాయకుల వరకు అందరూ తమ రాజకీయ వ్యూహకర్తలతో కలిసి కెమెరాల ముందుకు వచ్చి వర్టికల్ వీడియోల  భాషలో మాట్లాడుతున్నారు.

ఇన్ స్టాలో జెన్ జీ హవా 

ఈ భారీ మార్పుకు ప్రధాన హేతువు  డిజిటల్ మీడియా ప్రపంచంలో వచ్చిన తరం మార్పు , జెన్ జీ ఓటర్ల ఆవిర్భావం. 18 నుండి 27 ఏళ్ల వయస్సు గల ఈ కొత్త తరం ఓటర్లు ఫేస్‌బుక్‌ను దాదాపుగా పక్కన పెట్టేశారు. ఎక్స్‌ను కేవలం సమాచారం, వార్తల అప్‌డేట్ల కోసం మాత్రమే వాడుతున్న ఈ తరం.. రోజులో అత్యధిక సమయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, షార్ట్స్ స్క్రోల్ చేయడానికే కేటాయిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం కేంద్ర మంత్రులను యువతను ఆకట్టుకునేందుకు ఇన్‌స్టా రీల్స్ వేదికగా కంటెంట్ రూపొందించాలని ఇటీవల ఆదేశించడం ఈ వేదిక ప్రాముఖ్యతకు నిదర్శనం.

సెకన్లలోనే జెన్ జీని ఆకట్టుకోవాలి!

సాంప్రదాయ మేనిఫెస్టోలు, గంటల తరబడి ఇచ్చే ఉపన్యాసాలు వినే ఓపిక నేటి నిశ్శబ్ద ఓటర్లకు  లేదు. 15 నుండి 30 సెకన్ల వ్యవధిలోనే బలమైన రాజకీయ సందేశాన్ని స్పష్టంగా, వినోదాత్మకంగా చెప్పడం ఇక్కడ ప్రధాన సవాలు. దీంతో నేతలు పార్లమెంట్, అసెంబ్లీ వేదికలపై నుంచి మాట్లాడేటప్పుడు కూడా FOMO ,  Delulu వంటి జెన్ జీ భాషలోని పదాలను వాడటమే కాకుండా, తాము చేసే అభివృద్ధినైనా, ప్రత్యర్థులపై వేసే సెటైర్లయినా నేరుగా కంటిని చూస్తూ మాట్లాడే  సెల్ఫీ వీడియో  ట్రెండ్‌ను ఆశ్రయిస్తున్నారు.

సీనియర్ లీడర్లకు సవాలే 

అయితే, ఈ రీల్స్ విప్లవంలో వ్యూహాత్మక ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. టాప్‌-డౌన్ ప్రచారానికి ఆలవాటుపడిన పాత తరం ఐటీ సెల్ మోడల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తిగా వికటిస్తోంది. అల్గారిథమ్ చాలా క్లిష్టమైనది. కొద్దిగా డ్రామా, కృత్రిమత్వం కనిపించినా జెన్ జీ నెటిజన్లు ఆ వీడియోలను క్షణాల్లో మీమ్స్ గా మార్చి, ట్రోల్స్ రూపంలో ప్రచారం చేస్తున్నారు. సారాంశంలో, లైక్‌లు, వ్యూస్ సాధించడం సులభమే అయినప్పటికీ, నిమిషాల్లో ముగిసిపోయే ఈ రీల్స్ ప్రభావాన్ని ఓట్ల రూపంలోకి మార్చడం రాజకీయ శ్రేణులకు కొత్త లీగల్ మరియు కమ్యూనికేషన్ సవాలుగా మారింది.

ఇందు కోసం రాజకీయ నేతలు పెద్ద ఎత్తున పీఆర్ గ్రూపుల్ని హైర్ చేసుకుంటున్నారు. వారు ఇచ్చే స్క్రిప్టుల ప్రకారం నడుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు మారిపోయే జెన్ జీ ఆలోచనల్ని అందుకోవడం అంత తేలిక కాదు. అయినా నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు.                               

 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Embed widget