అన్వేషించండి

Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?

Chandrababu Political Maturity: ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు పదే పదే ప్రశంసిస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ఆయన తగ్గడం లేదు. దీని వెనుక ఉన్న అసలైన వ్యూహమేంటి?

AP NDA Alliance Governance:  రాజకీయాల్లో నాయకులకు వ్యక్తిగత అహం, సిద్ధాంత భేషజాలు ఉండటం సాధారణం. అయితే, ప్రజాస్వామ్యంలో అధికారం దక్కినప్పుడు వ్యక్తిగత ఆత్మగౌరవం కంటే తన్ను నమ్మి ఓటేసిన కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర పునరుద్ధరణే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా శైలి ద్వారా స్పష్టం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆయన పదే పదే ప్రశంసించడం,  వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో మోదీ నాయకత్వాన్ని బలపరచడంపై రాజకీయ ప్రత్యర్థులు, నెటిజన్లలో కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. ఆ విమర్శలను ఏమాత్రం లెక్కచేయకుండా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.

ఆర్థికంగా కేంద్రం సఖ్యత తప్పనిసరి

పైకి కనిపించే ఈ ప్రశంసలు  వెనుక అత్యంత పటిష్టమైన  కోఆపరేటివ్ ఫెడరలిజం వ్యూహం దాగి ఉందని అనుకోవచ్చు. 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ ఆర్థికంగా, పరిపాలనాపరంగా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. రాష్ట్ర బడ్జెట్ లోటు, అప్పుల భారం, నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణం, అటకెక్కిన పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ పూర్తి స్థాయి మద్దతు, ప్రత్యక్ష ఆర్థిక నిధుల కేటాయింపు అత్యంత ఆవశ్యకం. ఈ క్రమంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకోవడం చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాత్మక రాజకీయ లౌక్యం.

సాఫీగా సాగుతున్న ఏపీ అభివృద్ధి పనులు

ఈ లౌక్యానికి తగ్గ ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ సాయంతో పాటు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, గ్రాంట్లు విడుదల చేయడం, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి కీలక పురోగతులు కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సానుకూల సంబంధాల వల్లే సాధ్యమయ్యాయి. ప్రధాని మోదీకి, కేంద్ర కేబినెట్‌కు పదే పదే కృతజ్ఞతలు చెప్పడం ద్వారా చంద్రబాబు కేంద్ర నిధుల ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్గం సుగమం చేసుకుంటున్నారు.

గతంలో మోదీతో విబేధించిన వీడియోలు వైరల్ 

మరోవైపు, ప్రతిపక్షాల విమర్శల నరేటివ్‌ను గమనిస్తే.. గతంలో 2018లో ధర్మపోరాటం పేరుతో మోదీపై చంద్రబాబు చేసిన ఘాటు విమర్శల వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ  రాజకీయ ఆత్మవంచన గా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, 2019 నుండి 2024 వరకు కేంద్రంతో విభేదించి రాష్ట్రం సాధించిందేమీ లేదని, తీవ్రంగా నష్టపోయిందని గ్రహించిన చంద్రబాబు.. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న రాజకీయ పరిపక్వతను ప్రదర్శిస్తున్నారు.  కేంద్రంతో ఘర్షణ వైఖరి కంటే చర్చలు-లబ్ధి విధానమే ఏపీకి మేలనే స్పష్టమైన అంచనాతో ఆయన వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో ఈ సఖ్యత కేవలం నిధులకే పరిమితం కాకుండా.. విశాఖ-రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, రైల్వే జోన్ పనులు వేగవంతం కావడం, ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ విద్యాసంస్థలకు కేంద్ర గ్రాంట్లు పెరగడం, కొత్త పారిశ్రామిక కారిడార్ల కేటాయింపుల్లో ఏపీ ప్రాధాన్యత పెరగడం వంటి దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెడుతోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న తరుణంలో.. ఆ రాజకీయ ప్రభావాన్ని వ్యక్తిగత ఇమేజ్ కంటే రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికి ఇంధనంగా వాడుకోవడమే చంద్రబాబు బ్రాండ్ డిప్లొమసీగా అనుకోవచ్చు. 

రాజకీయాల కంటే రాష్ట్రమే ముఖ్యం

విమర్శలను స్వీకరిస్తూనే, వాటిని అధిగమించి అమరావతి సమగ్ర నిర్మాణం, పోలవరం పూర్తి, పరిశ్రమల తరలింపు ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రాథమిక లక్ష్యమని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. విమర్శకులు సెటైర్లు వేసినా, సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చినా.. రాష్ట్రానికి చేకూరే నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులే రేపటి రోజున తమ సమర్థతకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు.  వ్యక్తిగత రాజకీయ అహాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు నాయుడు నడుపుతున్న ఈ డిప్లొమాటిక్ పాలిటిక్స్ ఏపీ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయంగా   భావిస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
Reasons For Prashant Kishor Win: బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Embed widget