అన్వేషించండి

AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?

Andhra Pradesh Local Polls: స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన సాగుతున్నా కూటమి ప్రభుత్వం ఎన్నికలపై ఎందుకు మౌనంగా ఉంది? చంద్రబాబు వ్యూహాత్మక జాప్యం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి?

Chandrababu Naidu Local Elections Strategy:  ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల జైత్రయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే  కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేవు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో కూటమికి అనుకూల గాలి స్పష్టంగా వీస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని మెజారిటీ పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు మున్సిపల్ సంస్థల పదవీ కాలం ముగిసిపోయి, స్థానిక సంస్థలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లాయి. సాధారణంగా ఇలాంటి క్లీన్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఏ అధికార పార్టీ అయినా తక్షణమే స్థానిక ఎన్నికలు జరిపి కింది స్థాయి వరకు అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తుంది. కానీ, ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడు అంతర్గత సమీక్షలు జరిగినా  మరో రెండు, మూడు నెలల్లో  స్థానిక ఎన్నికలు అని చెబుతారు కానీ..  అడుగు ముందుకు పడటం లేదు.

వేసవిలో పూర్తి చేసి ఉంటే కాలం కలసి వచ్చేది!   

 వేసవి సెలవుల కాలంలోనే పంచాయతీ, పురపాలక ఎన్నికలను పూర్తి చేసి ఉంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎంతో అనుకూలంగా ఉండేది. అయినప్పటికీ ప్రభుత్వం ముందడుగు వేయకపోవడం వెనుక ప్రధాన కారణం వైసీపీ లోకల్ క్యాడర్ ను మరింత అలసిపోయేలా చేయడమేనని అనుకుంటున్నారు.  మరికొన్నాళ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తూ, గత ప్రభుత్వ అవినీతిపై విచారణలు జరిపి, లీగల్‌గా వారిని కట్టడి చేయడం ద్వారా.. వైసీపీకి కనీసం పోటీ చేసే ఓపిక లేకుండా చేసే ప్లాన్ ఉందన్న అభిప్రాయం వినిపిస్ోతంది. 
 
కూటమి అంతర్గత సమీకరణాలు 

మరోవైపు, స్థానిక ఎన్నికల జాప్యం వెనుక కూటమి అంతర్గత సమీకరణాల లెక్కలు కూడా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల పంపకం పైస్థాయిలో సజావుగా సాగిపోయింది కానీ, గ్రామ స్థాయికి వచ్చేసరికి టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి ఊరిలోనూ ప్రెసిడెంట్ సీటు కోసం, ప్రతి డివిజన్‌లోనూ కార్పొరేటర్ సీటు కోసం ఇరు పార్టీల స్థానిక నేతలు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఎన్నికలు పెడితే తమ్ముళ్ల మధ్య కొత్త పంచాయతీలు మొదలై కూటమి సఖ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను ముగించి, కీలక నేతలకు వివిధ కార్పొరేషన్లలో సర్దుబాటు చేసిన తర్వాత.. నియోజకవర్గాల వారీగా పూర్తి సమన్వయం కుదిరినప్పుడే స్థానిక సంస్థల బరిలోకి దిగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చినట్లు సమాచారం.

అభివృద్ధి పనులు మందగించకూడదని భావిస్తున్న ప్రభుత్వం 

 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సూపర్ సిక్స్ హామీల అమలు కూడా ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పునరుద్ధరణపైనే పూర్తి నిధులు, శ్రద్ధ పెడుతోంది. స్థానిక ఎన్నికలు వస్తే ప్రభుత్వ యంత్రాంగం అంతా మళ్లీ కోడ్ పరిధిలోకి వెళ్లిపోతుంది, పరిపాలన స్తంభిస్తుంది. అలా కాకుండా, మొదట ప్రభుత్వ గ్యారంటీల అమలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, ప్రజల్లో పూర్తి స్థాయి నమ్మకం సంపాదించిన తర్వాత.. ఆ ఊపులోనే స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా స్వీప్ చేయాలనేది చంద్రబాబు అసలు వ్యూహం.

సరైన సమయం కోసం చంద్రబాబు ఎదురు చూపు

 చంద్రబాబు నాయుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, శత్రువు పూర్తిగా బలహీనపడే వరకు, తన కూటమి శ్రేణులు పూర్తి సమన్వయానికి వచ్చే వరకు ఓపికగా వేచి చూస్తున్నారు. బడ్జెట్ ఆమోదం, నామినేటెడ్ పదవుల ప్రక్రియ ముగిసిన తర్వాత.. బహుశా ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్థానిక సమరానికి శంఖారావం పూరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతవరకు ప్రత్యేకాధికారుల ద్వారానే గ్రామాలు, నగరాల్లో కూటమి మార్క్ పాలనను జనానికి రుచి చూపించాలనేదే ప్రభుత్వ ప్రస్తుత రోడ్ మ్యాప్ అనుకోవచ్చు. 
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget