అన్వేషించండి

TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?

Ravan Issue: ఏపీ కూటమిలో ప్రశ్న రావణ్ ఇష్యూ కొత్త సమస్యలు సృష్టిస్తోంది. చంద్రబాబు, బీజేపీ ఈ టాపిక్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. జనసేన సీరియస్‌గా తీసుకుంది.

Andhra Pradesh Alliance Political Strategy:  ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పద యూట్యూబర్ జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్ట్, ఆపై అతనిపై అత్యంత కఠినమైన ఉపా చట్టం ప్రయోగించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించారనే సాధారణ కేసులో రావణ్‌కు వెంటనే బెయిల్ వచ్చినప్పటికీ.. ఆ వెంటనే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, నిషేధిత నక్సలైట్ల సిద్ధాంతాలను సమర్థించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద ఉపా చట్టాన్ని ఏపీ పోలీసులు ప్రయోగించారు. అయితే, ఈ చట్టాలను ప్రయోగించడంపై మేధావులు, రాజకీయ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ వివాదం చుట్టూ జరుగుతున్న పరిణామాలు.. ఇది అధికార కూటమి ఎజెండానా లేక కేవలం జనసేన వ్యక్తిగత పోరాటమా అనే సరికొత్త చర్చకు దారితీసింది.

పెద్దగా స్పందించని టీడీపీ, బీజేపీ 

ఈ వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..  రావణ్  ఇష్యూపై అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం  , భారతీయ జనతా పార్టీ  లు అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గానీ, ఐటీ మంత్రి నారా లోకేష్ గానీ ఈ అరెస్ట్ లేదా ఉపా చట్టం ప్రయోగంపై ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న, హిందూత్వ ఎజెండాను మోసే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈ అంశంలో పెద్దగా జోక్యం చేసుకోకుండా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తోంది. దీనికి భిన్నంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన మాత్రం ఈ ఇష్యూను పూర్తిగా ఓన్ చేసుకుని, సోషల్ మీడియా వేదికగా రావణ్ అక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ పోలీసుల చర్యను గట్టిగా సమర్థించుకుంటోంది.
  
 చట్ట విరుద్ధమన్న మాజీ ఐపీఎస్ 

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం యూట్యూబ్‌లో మాట్లాడిన మాటలకే  ఉపా  లాంటి కఠినమైన చట్టాన్ని ప్రయోగించడం చట్ట విరుద్ధమని, ఇది భవష్యత్తులో కోర్టుల ముందు నిలబడదని ఆయన అభిప్రాయపడటం చర్చనీయాంశమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కూటమి ప్రభుత్వంలో ఒక పక్కా  పని విభజన  కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా  సనాతన ధర్మ రక్షణ  అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. హిందూ దేవతలను, ఆచారాలను కించపరిచేలా మాట్లాడే వారిపై కఠినంగా వ్యవహరించాలనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత , రాజకీయ లైన్. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ను, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రావణ్‌ను ఉపా చట్టం కింద లోపల వేయడం ద్వారా.. హిందూ వ్యతిరేక శక్తులకు గట్టి  సందేశం పంపాలని జనసేన భావించింది. అందుకే జనసేన శ్రేణులు ఈ ఇష్యూను ఒక సామాజిక విజయంగా ప్రచారం చేసుకుంటున్నాయి.

చాణక్యం ప్రదర్శిస్తున్న చంద్రబాబు

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎంతో చాణక్యంగా వ్యవహరిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయి. ఒక యూట్యూబర్‌పై ఉపా చట్టం పెట్టడం వల్ల జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి  అణచివేత ముద్ర పడే ప్రమాదం ఉందనే క్లారిటీ బాబుకు ఉంది. అందుకే టీడీపీ ఈ వివాదానికి వీలైనంత దూరంగా ఉంటోంది. అటు శాంతిభద్రతల రక్షణ, ఇటు పవన్ కళ్యాణ్ సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే..  టీడీపీ ఇమేజ్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు.
 బీజేపీ మౌనం వెనుక కూడా ఒక బలమైన పొలిటికల్ రీజన్ ఉంది. సనాతన ధర్మం ఎజెండాను పవన్ కళ్యాణ్ ఏపీలో లీడ్ చేస్తుండటంతో, తాము వంతపాడితే పవన్ షాడోలో పడిపోతామనే భయం రాష్ట్ర బీజేపీ నేతల్లో ఉంది. అలాగే ఉపా అనేది సాధారణంగా కేంద్ర సంస్థలు తీవ్రవాద కేసుల్లో వాడే చట్టం కావడంతో, ఒక స్థానిక సోషల్ మీడియా అబ్యూజింగ్ కేసుకు దీనిని వాడటాన్ని కేంద్ర పెద్దలు కూడా అంతర్గతంగా పెద్దగా స్వాగతించడం లేదనే టాక్ నడుస్తోంది.

జనసేన టేకప్ చేసిన ఇష్యూ 

రావణ్ ఇష్యూ అనేది స్పష్టంగా కూటమి ఉమ్మడి ఎజెండా కంటే కూడా జనసేన, పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన ప్రత్యేక ఎజెండాగానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ ఐడెంటిటీని మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ కేసును వాడుకుంటుండగా, టీడీపీ ,  బీజేపీలు దీనివల్ల వచ్చే లీగల్ అండ్ పబ్లిక్ కాంప్లికేషన్స్ నుంచి సేఫ్‌గా తప్పించుకోవడానికి  వెయిట్ అండ్ వాచ్  పాలసీని అవలంబిస్తున్నాయి. రాబోయే రోజుల్లో హైకోర్టులో ఉపా చట్టం నిలబడుతుందా లేదా అనేది తెలుస్తుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Telangana SIR Process Voter Deletions: తెలంగాణలో పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు - కాంగ్రెస్ నేతల వైఫల్యమేనా? హైకమాండ్ ఆగ్రహం ఎందుకు?
తెలంగాణలో పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు - కాంగ్రెస్ నేతల వైఫల్యమేనా? హైకమాండ్ ఆగ్రహం ఎందుకు?
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Embed widget