అన్వేషించండి

Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే

Monsoon Tips : వర్షాకాలంలో ఇంట్లో ఉక్కబోత ఎక్కువగా ఉంటుందా? ఏసీ లేకున్నా ఈ తేమను ఎలా కంట్రోల్ చేయాలో.. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే గది ఉష్ణోగ్రత అదుపులో ఉంటుందో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షం తగ్గాక గది వెంటిలేషన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడండి.
  • ఐస్ క్యూబ్స్ ముందు ఫ్యాన్, కూలర్ పంప్ ఆపండి.
  • ఇండోర్ మొక్కలు, కర్టెన్లు, విశాల గది తేమను తగ్గిస్తాయి.

Monsoon Humidity at Home : వర్షాలు పడగానే వేడి స్థానంలో తేమ పెరిగిపోతుంది. ఫ్యాన్లు, కూలర్లు వేసుకున్నా.. గది ఒక కొలిమిలా వేడిగా ఉంటుంది. వర్షాకాలంలో ఇదే అతిపెద్ద సమస్య. ఉష్ణోగ్రత తగ్గినప్పటికీ.. గాలిలో తేమ ఎంతగా పెరిగిపోతుందంటే.. ఎయిర్ కండిషనర్ లేని ఇంట్లో జీవించడం కష్టం అనేంతలా మారుతుంది. కానీ ఏసీ లేకున్నా కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ తేమ, ఉక్కబోతను చాలా వరకు నియంత్రించవచ్చు. అవేంటంటే..

వెంటిలేషన్ టిప్స్

వర్షం ఆగిపోయిన వెంటనే బయట వాతావరణాన్ని చూడండి. గాలిలో తేమ మరీ ఎక్కువ లేకపోతే.. కాసేపు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. అలాగే గదిలో పేరుకుపోయిన తేమతో కూడిన గాలిని తొలగించడానికి ఫ్యాన్ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను వేయండి. అయితే బయట గాలిలో తేమ మరీ ఎక్కువగా ఉంటే.. కిటికీలు మూసి ఉంచడమే మంచిది.

Also Read : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

ఐస్, టేబుల్ ఫ్యాన్‌తో టిప్

సీలింగ్ ఫ్యాన్ కూడా వేడిని ఇస్తుంటే.. ఈ చిట్కాను ప్రయత్నించండి. ఒక పెద్ద గిన్నెలో పుష్కలంగా ఐస్ క్యూబ్స్ నింపి.. దానిని నేరుగా టేబుల్ లేదా పెడెస్టల్ ఫ్యాన్ ముందు ఉంచండి. ఫ్యాన్ గాలి మంచును తాకి గది అంతటా ప్రసరించినప్పుడు.. అది తేమను పీల్చుకుని, ఒక మోస్తరు ఏసీ లాగా చల్లని, తాజా గాలిని అందిస్తుంది.

కూలర్ ఉపయోగిస్తుంటే ఈ టిప్

చాలాసార్లు కూలర్‌ను ఆన్ చేసిన వెంటనే వాటర్ పంప్‌ను కూడా ఆన్ చేస్తారు. ఇదే అతిపెద్ద పొరపాటు. మూసి ఉన్న గదిలో నీటిని నిరంతరం పారించడం వల్ల గాలిలో తేమ పెరిగి.. గది చల్లబడటానికి బదులుగా తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. సరైన పద్ధతి ఏమిటంటే.. గది కొద్దిగా చల్లగా మారిన తర్వాత పంప్‌ను ఆపివేసి.. కూలర్‌ను కేవలం ఫ్యాన్ మోడ్‌లో రన్ చేయాలి.

Also Read : వర్షాకాలంలో ఇంట్లో ఈ ప్రదేశాలను తప్పకుండా శుభ్రం చేయండి.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే

ఇండోర్ ప్లాంట్స్ 

వేడి, తేమతో కూడిన వాతావరణంలో.. మట్టి కుండ పరిసరాలను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే కలబంద, స్నేక్ ప్లాంట్, తులసి వంటి ఇంట్లో పెంచుకునే మొక్కలు కూడా గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, గదిని తాజాగా ఉంచడానికి సహాయపడతాయి.

ఆ సమయంలో కర్టెన్లు వేసేయండి..

గదిలోకి నేరుగా సూర్యరశ్మి ప్రవేశించడం వల్ల వేడి, తేమ రెండూ పెరుగుతాయి. కాబట్టి పగటిపూట సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు.. తెరలను మూసి ఉంచితే గది ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

Also Read : వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి

ఖాళీగా, శుభ్రంగా..

గది ఎంత చిందరవందరగా ఉంటే గాలి ప్రసరించడం అంత కష్టమవుతుంది. గది అంతటా గాలి స్వేచ్ఛగా ప్రసరించడానికి బరువైన ఫర్నిచర్, అనవసరమైన వస్తువులు, అదనపు దుస్తులను తొలగించి గదిని విశాలంగా ఉంచండి. అలాగే, పసుపు రంగు బల్బులకు బదులుగా LED లైట్లను ఉపయోగించండి. ఎందుకంటే సాధారణ LEDల కంటే పసుపు రంగు బల్బులు ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ganguly Doosra Row: గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
Blood Pressure Risks : ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
Weight Loss Drinks : బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
Diwali Cleaning Tips : దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget