అన్వేషించండి

Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్

Prashna Ravan Arrest | సుగాలి ప్రీతి లాంటి కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడం చేతకాని ప్రభుత్వం, రావణ్‌ను వెంబడించి వేధిస్తుందని ప్రశ్న రావణ్ అన్నారు. తనను చంపినా, ప్రశ్నల్ని చంపలేరని అన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూట్యూబర్ ప్రశ్న రావణ్ నాలుగో బెయిల్ వచ్చాక ఐదోసారి అరెస్ట్.
  • తన గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
  • ప్రజా సమస్యలు వదిలి తనపై దృష్టి పెట్టడం సిగ్గుచేటన్నారు.
  • ప్రభుత్వం తనను వేధించకుండా పీఎస్‌లోనే చంపేయమని సవాల్.

Youtuber Prashna Ravan Arrest | అమరావతి: వరుస అరెస్టులు, పోలీసు నిర్బంధాలపై యూట్యూబర్ ప్రశ్న రావణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఒక కేసులో తనకు నాలుగో బెయిల్ వచ్చిన వెంటనే, వేంపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు ఐదోసారి తనను అరెస్టు చేసి నక్కపల్లికి తరలిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాదె సాయికృష్ణ తరహాలో తనను కూడా పోలీస్ స్టేషన్‌లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ అయిన సందర్భంగా ప్రశ్న రావణ్ మాట్లాడుతూ, తన గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోందని, కానీ ఒక మనిషి (ప్రశ్న రావణ్)ని చంపగలరేమో కానీ, ప్రజల్లో ప్రశ్నించే స్వభావాన్ని, ప్రశ్నల్ని ఎవరూ చంపలేరని ప్రభుత్వానికి ఘాటుగా సమాధానమిచ్చారు.

కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు 500 మంది పోలీసులు..

రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉంటే వాటిని గాలికొదిలేసి, ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు సుమారు 500 మంది పోలీసులు తిండి తిప్పలు వదిలేసి తన వెంటే తిరుగుతుండటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తాను ఎటువంటి దొమ్మీలు, దౌర్జన్యాలు చేయలేదని, అత్యాచారాలు చేయలేదన్న యూట్యూబర్ రావణ్.. కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించడమే తాను చేసిన నేరమా? అని నిలదీశారు. గత నాలుగు రోజులుగా తాను ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని, వ్యవస్థ మొత్తాన్ని ఒక మనిషి కోసం ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.

రాష్ట్ర చరిత్రలో 4 రోజుల్లో నాలుగు అరెస్టులు, బెయిల్స్ రావడం తొలిసారి అని, అయినా మరో కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు.  జనసేన నియోజకవర్గాలకు తాను వెళ్తే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ జరుగుతున్నాయని, అంటే నన్ను చంపడమే మీ లక్ష్యమా అని ప్రశ్నించారు. 

వేధించే బదులు నేరుగా పీఎస్‌లోనే చంపేయండి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ విధంగా తనను మానసికంగా, శారీరకంగా వేధించే బదులు నేరుగా పోలీస్ స్టేషన్‌లోనే చంపేయాలని ఆయన సవాలు విసిరారు. తాను వెళ్ళిన చోటల్లా వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నాయని, కొందరు గూండాలు తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి వంటి సంచలన కేసుల్లో బాధితులకు కనీసం న్యాయం చేయలేని ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న తనపై నాన్-బైలబుల్ సెక్షన్లు పెట్టి జైలుకు పంపాలని చూడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఒక పౌరుడిగా నిరసన తెలిపే హక్కు తనకు ఉందని, ఈ నిర్బంధాలకు భయపడకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ అరెస్టు చేసి శుక్రవారం రాత్రి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ప్రాధేయపడటంతో న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్‌ కోర్టులో వాదనలు వినిపించారు. న్యాయాధికారి బాలా త్రిపుర సుందరి రావణ్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. అయితే, బెయిల్ పొంది బయటకు వచ్చిన వెంటనే, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు రావణ్‌ను వేరే పాత కేసులో తిరిగి అదుపులోకి తీసుకున్నారు. శనివారం బెయిల్ మీద విడుదల కాగానే, మరో కేసులో పోలీసులు రావణ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దుమారం రేపుతోంది.

Frequently Asked Questions

యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను ఎందుకు అరెస్టు చేశారు?

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడమే తాను చేసిన నేరమా అని ప్రశ్న రావణ్ నిలదీశారు. తన గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రశ్న రావణ్ ను ఇది ఎన్నోసారి అరెస్టు చేశారు?

నాలుగోసారి బెయిల్ వచ్చిన వెంటనే, వేంపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు ఐదోసారి ప్రశ్న రావణ్ ను అరెస్టు చేసి నక్కపల్లికి తరలిస్తున్నారు.

ప్రశ్న రావణ్ ప్రభుత్వంపై చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

ప్రజా సమస్యలను విస్మరించి, ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు 500 మంది పోలీసులు తన వెంటే తిరుగుతున్నారని ప్రశ్న రావణ్ విమర్శించారు. తనను మానసికంగా, శారీరకంగా వేధించే బదులు నేరుగా పోలీస్ స్టేషన్ లోనే చంపేయాలని ఆయన సవాలు విసిరారు.

ప్రశ్న రావణ్ ప్రస్తుతం ఏ విధంగా నిరసన తెలుపుతున్నారు?

గత నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని ప్రశ్న రావణ్ తెలిపారు. ఈ నిర్బంధాలకు భయపడకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
Amaravati Projects Budget: అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget