అన్వేషించండి

YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!

YS Jagan vs Chandrababu Naidu:తెలంగాణలో పోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేసిన నిందితుడికి జగన్‌కు పెద్ద తేడా లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇద్దరిదీ సైకో మనస్తత్వమని విమర్శలు చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చంద్రబాబు జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారన్నారు.
  • జగన్ హిట్ అండ్ రన్ స్వభావం; సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తారన్నారు.
  • పోక్సో నిందితుడితో జగన్ మనస్తత్వాన్ని పోల్చడం తీవ్ర కలకలం రేపింది.
  • ప్రజలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి; ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.

YS Jagan vs Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు రేపటానికి నిత్యం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తనకు సహకరించని వారిపై దాడి చేస్తున్నారని, అందుకు సోషల్ మీడియాలోను వాడుకుంటున్నారని అన్నారు. జగన్‌ది హిట్‌ అండ్ రన్ స్వభావమని తెలిపారు. రాష్ట్రానికి ఒకరోజు ఏదో చిచ్చు రేపి బెంగళూరు వెళ్లిపోయి దాక్కుంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోక్సో కేసు పెట్టారని కక్షతో ఆరుగురిని చంపిన వ్యక్తికి జగన్‌కు తేడా లేదన్నారు. ఇద్దరిదీ ఒకటే మైండ్ సెట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

నచ్చని వారిని, సహకరించని వారిపై కక్ష పెంచుకొని టార్గెట్ చేయడం జగన్‌ స్వభావమని తెలిపారు చంద్రబాబు. రెండోసారి అధికారం ఇవ్వలేదని ఆగ్రహంతో ఆయన రెండు విషయాలనే నమ్ముకున్నారని అన్నారు. ఒకటి గొడ్డలి, రెండోది సోషల్ మీడియా. నచ్చని వారిని తిట్టడం సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోలింగ్ చేయడం అలవాటుగా మారిందన్నారు. వారి అండ చూసుకొని నేరమనస్తత్వం ఉన్న కొందు ప్రభుత్వాన్ని, లీడర్లను టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇలాంటి వాటి పట్ల ప్రజలు, టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీ సమావేశాల్లో కూడా ఈవిషయాన్ని చెబుతున్నట్టు వెల్లడించారు. అలాంటి కామెంట్స్‌కు రెచ్చిపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని చెప్పినట్టు తెలిపారు. సైకో మనస్తత్వం ఉన్న పార్టీ నేతలు ఇతరులను రెచ్చగొట్టేందుకు ఏదేదో చేస్తుంటారని అన్నారు. తెలంగాణలో పోక్సో కేసు పెట్టారని కసితో ఆరుగురిని హత్య చేసిన నిందితుడి నేర మనస్తత్వం ఎంత ప్రమాదకరమో జగన్ అంత ప్రమాదకరమని అన్నారు. తనను అధికారానికి దూరం చేశారన్న కసితో నచ్చని వారిని బూతులు తిట్టడం, నెగెటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహించారు. 

ఇలాంటి వాటి సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్పందించవద్దని చంద్రబాబు సూచించారు. కచ్చితంగా నేరం చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్దమో తెలుసుకునే టూల్స్ ఉన్నాయని వాటిని ఉపయోగించి నిజానిజాలు తెలుసుకోవాలని చెప్పారు. భవిష్యత్‌లో వచ్చే టెక్నాలజీతో ఇలాంటి వాటిని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.  అంతే కాని వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు. 

రాష్ట్రానికి మేలు జరగకుండా చేయడమే జగన్, వైసీపీ నేతల లక్ష్యమని చంద్రబాబు అన్నారు. అందుకు ఏ స్థాయికైనా వారు వెళ్తారని అభిప్రాయపడ్డారు. తమ హయాంలో మంచి చేయలేదని ఇప్పుడు కూడా మంచి జరగకూడనే వారు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. అందుకే ఒకసారి మూడు రాజధానులని, ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా భోగాపురం పూర్తి చేశామని త్వరలోనే అక్కడి నుంచి ఫ్లైట్స్‌ టేకాఫ్ అవుతాయన్నారు చంద్రబాబు. పోలవరం, వెలుగొండ, అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న వనరులు వాడుకుంటే భారీగా పెట్టుబడులు వస్తాయని, అదే కూటమి ప్రభుత్వం చేస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. దీనికి అడ్డుతగిలే వాళ్లను ప్రజలు క్షమించబోరని వార్నింగ్ ఇచ్చారు.  

Frequently Asked Questions

వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌పై చంద్రబాబు నాయుడు చేసిన ప్రధాన వ్యాఖ్యలు ఏమిటి?

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు రేపడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని, సహకరించని వారిపై దాడి చేస్తూ సోషల్ మీడియాను వాడుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ది

జగన్ స్వభావం గురించి చంద్రబాబు నాయుడు ఏమని వర్ణించారు?

నచ్చని వారిని, సహకరించని వారిపై కక్ష పెంచుకొని టార్గెట్ చేయడం జగన్ స్వభావమని చంద్రబాబు తెలిపారు. అధికారం ఇవ్వలేదని ఆగ్రహంతో గొడ్డలి, సోషల్ మీడియాను నమ్ముకుని నెగెటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు.

సోషల్ మీడియా ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఎవరికి సూచించారు?

ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. రెచ్చిపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని, అలాంటి కామెంట్స్‌కు స్పందించవద్దని కోరారు.

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టనున్న ప్రధాన అభివృద్ధి పనులు ఏమిటి?

భోగాపురం పనులు పూర్తి చేశామని, పోలవరం, వెలుగొండ, అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వనరులు వాడుకుంటూ భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తామని చెప్పారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget