అన్వేషించండి

YS Jagan Mavigan Capital Plan Analysis: పొలిటికల్ ఎజెండా షిఫ్ట్ - మూడు రాజధానుల నుండి మావిగన్ కారిడార్‌కు జగన్ షిఫ్ట్.. ప్రజలు నమ్ముతారా?

YSRCP Capital Shift Controversies: వచ్చే ఎన్నికలకు జగన్ అజెండా సెట్ చేశారు. మావిగన్‌కు మద్దతిచ్చేవాళ్లంతా వైసీపీకి ఓటేస్తారని అన్నారు. అయితే ఆయన ప్రజల్ని నమ్మించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.

Amaravati vs Mavigan Election Agenda 2026 : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ   అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా ప్రకటన రాష్ట్రంలో ఒక కొత్త పొలిటికల్ డిబేట్‌ను లేవనెత్తింది. వచ్చే ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోరు కాదని..  "మావిగన్ వర్సెస్ అమరావతి"  నినాదాల మధ్యే పోరు అని ఆయన అజెండా సెట్ చేశారు. అయితే,   ఐదేళ్లు మూడు రాజధానుల జపం చేసిన జగన్, ఇప్పుడు ఒక్కసారిగా  మావిగన్ మచిలీపట్నం-MA, విజయవాడ-VI, గుంటూరు-GUN గ్రోత్ కారిడార్ అనే సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ఎన్నికల అజెండాగా మార్చడం వెనుక రాజకీయ చదరంగం ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
 
 మాట మార్పుపై ప్రజల్లో అనుమానాలు 

రాజధాని విషయంలో వైసీపీ అధినేత విధానాలు నిలకడలేకుండా ఉన్నాయనే విమర్శలు క్షేత్రస్థాయిలో, సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. 2014-19 మధ్య విపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికిన జగన్.. 2019లో అధికారంలోకి వచ్చాక  మూడు రాజధానుల  ప్రతిపాదన తెచ్చి అమరావతి పనులను పూర్తిగా నిలిపివేశారు. ఆ నినాదంతోనే 2024 ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయం   చవిచూశారు. ఇప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న తరుణంలో.. విశాఖ, కర్నూలు ఊసు ఎత్తకుండా కేవలం మావిగన్ కారిడార్ అనడం చూస్తుంటే, ఒకే అంశంపై ఇన్నిసార్లు మాట మార్చడాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారనే అనుమానాలు రాజకీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 

 అసలు ‘మావిగన్’ ప్లాన్ ఏంటి?  

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఈ  మావిగన్  నమూనాపై వైసీపీ ఇప్పటికైనా పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మచిలీపట్నం పోర్టును, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి ఒక 110 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని చెప్తున్న జగన్.. అసలు ఇక్కడ సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ వంటి పరిపాలనా విభాగాలు ఉంటాయా? లేదా అనేది క్లియర్ చేయలేదు. ఇది కేవలం పారిశ్రామిక అభివృద్ధి కేంద్రమా? లేక ఉద్యోగ, ఉపాధి సృష్టికి సంబంధించిన ప్లాన్ మాత్రమేనా? అన్నదానిపై క్లారిటీ లేదు. శూన్యం నుండి అమరావతిని కట్టడానికి లక్షల కోట్లు వృథా చేయడం కంటే, మౌలిక సదుపాయాలు ఉన్న ఈ మూడు నగరాలను కనెక్ట్ చేయడం ఆర్థికంగా బెటర్ అనేది జగన్ ఆలోచన అయినప్పటికీ.. దీని బ్లూప్రింట్ ఏంటన్నది ప్రజల ముందు ఉంచితేనే విశ్వసనీయత పెరుగుతుంది. 

 మళ్లీ గందరగోళంలోకి నెట్టే వ్యూహం.. 

ఈ  మావిగన్  వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం నెల్లూరు జిల్లా పర్యటనలో తీవ్రంగా స్పందించారు.  గతంలో మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్లు.. ఇప్పుడు మావిగన్  అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారు.. అసలు మావిగన్ అంటే ఏంటో నాకే అర్థం కావడం లేదు"  అంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. ఏపీ పునర్నిర్మాణానికి తాము ప్రయత్నిస్తుంటే, అమరావతిపై ఉన్న అక్కసుతోనే వైసీపీ మళ్లీ ప్రజల్లో ప్రాంతీయ, స్థానిక విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఒక చట్టబద్ధమైన రాజధానిపై ఇలాంటి గందరగోళ ప్రకటనలు పక్క రాష్ట్రాల ముందు ఏపీ పరువు తీసేలా ఉన్నాయనే విమర్శలూ వస్తున్నాయి.
 
 ఓటర్లను నమ్మించాలంటే వైసీపీ చాలా కష్టపడాలి! 

రాజకీయాల్లో విశ్వసనీయత అత్యంత కీలకం. ఒకే పార్టీ ఒకే రాజధాని అంశంపై ఒకసారి అమరావతి అనుకూలం అని, మరోసారి మూడు రాజధానులు అని, ఇప్పుడు కేవలం  మావిగన్  కారిడార్ అని చెప్పడం వల్ల సామాన్య ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల అజెండా సక్సెస్ అవ్వాలంటే.. కేవలం అమరావతి అవినీతిని విమర్శించడం మాత్రమే సరిపోదు. అమరావతి కంటే ఈ  మావిగన్  కారిడార్ ద్వారా పేదలకు, యువతకు ఎలాంటి మేలు జరుగుతుందో వివరించే ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను, ఉపాధి సృష్టి ప్రణాళికను వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి జనాల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేనిపక్షంలో, ఇది కూడా గత  మూడు రాజధానుల తరహాలోనే ఒక పొలిటికల్ స్లోగన్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget