అన్వేషించండి

Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

Demand For Harish Rao Statewide Padayatra: సిద్ధిపేటలో హరీశ్ రావు పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. దాంతో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు కేడర్ డిమాండ్ చేస్తోంది. కానీ కేటీఆర్ ఇప్పటికే రెడీ అయ్యారు.

BRS Internal Politics KTR vs Harish Rao: సిద్ధిపేట జిల్లాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ లీడర్ తన్నీరు హరీశ్ రావు నిర్వహించిన పాదయాత్ర గులాబీ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య చర్చకు తెరలేపింది. రైతాంగ సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదల డిమాండ్‌తో హరీశ్ రావు చేపట్టిన ఈ యాత్రకు క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతుల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం నియోజకవర్గ లేదా జిల్లా స్థాయి నిరసనగా కాకుండా, ఒక బహుళ ప్రజా ఉద్యమంగా ఈ యాత్ర రూపాంతరం చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా హరీశ్ రావు పాదయాత్ర చేపడితే పార్టీకి పూర్వవైభవం సాధించడం తేలికవుతుందనే అభిప్రాయాలు బీఆర్ఎస్ వర్గాల్లో బలపడుతున్నాయి.

త్వరలో పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్

అయితే, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్‌ను మళ్లీ అధికార దిశగా నడిపించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రస్థాయి యాత్రలు, సభల బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కేటీఆర్ నేతృత్వంలోనే  కార్యక్రమాలు చేపట్టాలని హైకమాండ్ భావిస్తున్న తరుణంలో, క్షేత్రస్థాయి కేడర్ మాత్రం  మాస్ కనెక్టివిటీ ఉన్న హరీశ్ రావు వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. పల్లెల్లో రైతులు, సామాన్య ప్రజలతో కలిసిపోయే నైజం, సుదీర్ఘమైన సంక్షోభ నిర్వహణ అనుభవం  ఉన్న హరీశ్ రావు అయితేనే కాంగ్రెస్ వైఫల్యాలను జనంలోకి బలంగా తీసుకెళ్లగలరనే వాదన గులాబీ శ్రేణుల్లో విపరీతంగా పెరిగింది.

నాయకత్వంపై కనిపించని పోటీ

ఈ భిన్నమైన అభిప్రాయాలు బీఆర్ఎస్ లోపల ఏమైనా అంతర్గత సంక్షోభాన్ని కాకపోయినా నాయకత్వ  సవాలు గా  చూడవచ్చు.  తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ కేటీఆర్ గ్రామీణ, పట్టణ డిజిటల్ నెట్‌వర్కింగ్, నేషనల్ అప్పీల్‌తో కార్పొరేట్ లుక్‌ను ప్రతిబింబిస్తే, హరీశ్ రావు పక్కా తెలంగాణ మాస్, అగ్రికల్చర్, గ్రౌండ్-లెవల్ ఆర్గనైజేషనల్ పవర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా బిల్డప్‌ల కంటే భౌతికంగా జనంలో తిరిగే నాయకుడికే ఎక్కువ ఆదరణ ఉంటుంది కాబట్టి, సహజంగానే హరీశ్ రావు గ్రాఫ్ పార్టీ శ్రేణుల్లో పైచేయి సాధిస్తోంది. కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ప్రస్తుత వాతావరణంలో, పార్టీకి  అధిపతి ఎవరు  అనే దానిపై ద్వితీయ శ్రేణి నాయకత్వంలో గందరగోళం నెలకొంది. కేటీఆర్‌ను తదుపరి వారసుడిగా ప్రాజెక్ట్ చేసే క్రమంలో హరీశ్ రావు పాత్రను కేవలం సిద్ధిపేట లేదా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధికే పరిమితం చేస్తున్నారనే అసంతృప్తి హరీశ్ మద్దతుదారుల్లో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు సిద్ధిపేట పాదయాత్ర సక్సెస్ కావడంతో.. హరీశ్ రావుకు రాష్ట్రస్థాయిలో స్వేచ్ఛనిస్తే కేటీఆర్ ప్రాబల్యం తగ్గుతుందనే ముందస్తు వ్యూహంతోనే ఆయనను మిగతా జిల్లాల్లో పాదయాత్రలకు అనుమతించడం లేదనే ఆరోపణలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియా పవర్ సరిపోదని ఎక్కువ మంది భావన

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మార్క్ అగ్రెసివ్ రాజకీయాన్ని ఎదుర్కోవాలంటే కేవలం హైదరాబాద్ వేదికగా చేసే ప్రెస్ మీట్లు, ట్విట్టర్  వార్లతో సాధ్యం కాదని బీఆర్ఎస్ శ్రేణులు గుర్తించాయి. ఈ క్రమంలోనే ధర్నా చౌక్‌లు, ప్రాజెక్టుల సందర్శన, పొలాల బాట పట్టే విషయంలో హరీశ్ రావు చూపిస్తున్న చొరవను పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నాయి.  ఈ పరిణామాలు బీఆర్ఎస్‌లో ప్రత్యక్ష చీలికకు దారితీయకపోయినా, అధికారికంగా పార్టీని నడిపిస్తున్న వర్గానికి, క్షేత్రస్థాయి బలమున్న హరీశ్ వర్గానికి మధ్య ఒక రకమైన సైలెంట్ పవర్ స్ట్రగుల్   నడుస్తోందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేసీఆర్ స్పందించి కేటీఆర్, హరీశ్ రావుల మధ్య స్పష్టమైన బాధ్యతల విభజన చేయకపోతే ఈ నెరేటివ్ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఒకరికి గ్రేటర్ హైదరాబాద్, అర్బన్ నియోజకవర్గాలు, మరొకరికి రూరల్ తెలంగాణ, రైతు పోరాటాల బాధ్యతలు అప్పగించాలన్న సూచనలు కూడా పార్టీ పెద్దలకు అందుతున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget