అన్వేషించండి

Prime Minister Modi: "రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 

Prime Minister Modi: నేటి యువత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉన్నారని, అందువల్ల మంత్రులందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని మోదీ కేబినెట్ మంత్రులకు సూచించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ నిరసనల మధ్య ప్రధాని మోడీ క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు.
  • మంత్రులు ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండాలని ప్రధాని సూచించారు.
  • యువతకు చేరువై, ప్రభుత్వ పథకాలను రీల్స్‌తో ప్రచారం చేయమన్నారు.

Prime Minister Modi: నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (జూలై 24, 2026) క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశంలో, ప్రధాని మోదీ క్యాబినెట్ మంత్రులతో పలు అంశాలపై చర్చించారు. విద్యార్థులతో మమేకమవ్వడం, వారితో టచ్‌లో ఉండటం చాలా అవసరం, ఈ విషయంలో ప్రధాని మోదీ మంత్రులకు సలహాలు కూడా ఇచ్చారు.

కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ మంత్రులకు ఏ సలహా ఇచ్చారు ?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులను ఊహించని ప్రశ్న అడిగారు. ప్రభుత్వంలోని ఎంతమంది మంత్రులు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చురుకుగా ఉన్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివ్‌నెస్‌ పెంచుకోవాలని ఆయన మంత్రులకు సూచించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నేటి యువత సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్‌లపై చాలా యాక్టివ్‌గా ఉంటున్నారని, కాబట్టి మంత్రులందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అంతే యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి క్యాబినెట్ మంత్రులకు సలహా ఇచ్చారు. మంత్రులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు, యువతకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేయాలని షేర్ చేయాలి. యువతకు మరింత చేరువయ్యేందుకు తాను మొన్న (గురువారం, జూలై 23, 2026) రూపొందించిన ఒక వీడియో గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. 

ప్రధాని మోదీ మంత్రులను ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండమని ఎందుకు కోరారు ?

నిజానికి, నీట్ పరీక్ష పేపర్ లీక్ తర్వాత, ప్రభావిత విద్యార్థులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ క్రియేట్‌ చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. ఈలోగా, సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP)కి, జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలకు వివిధ వర్గాల నుంచి మద్దతు రావడం జరిగింది. యువత, విద్యార్థులు నిరసనలపై, ప్రభుత్వ చర్యలకు, ఢిల్లీ పోలీసుల కాల్పులకు సంబంధించిన రీల్స్‌ను పోస్ట్ చేయడం, షేర్ చేయడం చేస్తున్నారు. ఇది మరింత మంది విద్యార్థులను ప్రేరేపిస్తోంది. ఈ ధోరణి గమనించిన ప్రధాని మోదీ క్యాబినెట్ సమావేశంలో తన మంత్రులకు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండాలని సూచించారు.

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ చేసి పథకాలు, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల గురించి ప్రమోట్ చేయాలని చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒకసారి ఇలాంటి క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు యువతలో ఆవేశాలు చూసిన మోదీ మరోసారి మంత్రులకు ఇలాంటి సూచనలు చేశారు. ఆయన సూచనలు చేయడమే కాకుండా రెండు రోజుల నుంచి నేరుగా యూత్‌తో మాట్లాడుతున్నట్టు వీడియోలు పోస్టు చేస్తున్నారు. 

Frequently Asked Questions

ప్రధాని మోదీ క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు ఇచ్చిన సలహా ఏమిటి?

విద్యార్థులతో మమేకవ్వడం, వారితో టచ్‌లో ఉండటం చాలా అవసరమని ప్రధాని మోదీ మంత్రులకు సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం ద్వారా యువతకు చేరువ కావాలని సూచించారు.

క్యాబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ మంత్రులను సోషల్ మీడియాలో ఏమి చేయమని కోరారు?

ప్రధాని మోదీ మంత్రులను ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై రీల్స్ చేసి యువతకు తెలియజేయాలని కోరారు.

నీట్ పరీక్ష పేపర్ లీక్ తర్వాత ప్రధాని మోదీ మంత్రులకు సోషల్ మీడియా గురించి ఎందుకు సూచించారు?

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఉపయోగించడాన్ని ప్రధాని గమనించారు. యువత సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నందున, మంత్రులు కూడా అక్కడ యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget