శనివారం మధ్యాహ్నం టెహ్రాన్ నగరంలోని కీలకమైన డౌన్‌టౌన్ ఏరియాలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లు సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయం ఉన్న ప్రాంతంలో జరిగాయి.
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ISRAEL-IRAN WAR: శనివారం మధ్యాహ్నం సుమారు 12.40 గంటల సమయంలో టెహ్రాన్ నగరంలోని కీలకమైన డౌన్‌టౌన్ ఏరియాలో వరుస పేలుళ్లు సంభవించాయి.

ISRAEL-IRAN WAR: మధ్య ప్రాచ్యం మరోసారి అగ్నిగుండంగా మారింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం శనివారం మధ్యాహ్నం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ప్రపంచ దేశాలు ఏ పరిణామానికైతే భయపడ్డాయో, అది ఇప్పుడు కళ్ల ముందే జరుగుతోంది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా సైన్యాలు ఉమ్మడిగా ఒక భారీ ముందస్తు దాడి నిర్వహించాయి. ఈ ఆకస్మిక దాడితో టెహ్రాన్ ఆకాశం దట్టమైన పొగలతో నిండిపోయింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ దాడిని ధ్రువీకరిస్తూ తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
టెహ్రాన్‌లో ఏం జరిగింది? పేలుళ్ల వెనుక అసలు కథ!
శనివారం మధ్యాహ్నం సుమారు 12.40 గంటల సమయంలో టెహ్రాన్ నగరంలోని కీలకమైన డౌన్‌టౌన్ ఏరియాలో వరుస పేలుళ్లు సంభవించాయి. అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ, ఇరాన్ స్టేట్ టెలివిజన్ నివేదికల ప్రకారం ఈ పేలుళ్లు నేరుగా సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే జరిగాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతోపాటు అమెరికా వైమానిక దళం కూడా ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇది కేవలం ఒక్క హెచ్చరిక దాడి మాత్రమే కాదని, ఇరాన్ అణు సామర్థ్యాన్ని, నాయకత్వాన్ని దెబ్బ తీసేందుకు పక్కా ప్లాన్‌తో చేసిన దాడిగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఖమేన ఎక్కడ? 86 ఏళ్ల నేత సేఫ్‌గానే ఉన్నారా?
ఈ దాడి జరిగిన సమయంలో 86 ఏళ్ల ఖమేనీ తన కార్యాలయంలోనే ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. గత కొన్ని రోజులుగా అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించ లేదు. అయితే రాయిటర్స్ వార్త సంస్థ అందించిన సమాచారం ప్రకారం దాడికి ముందే ఇరాన్ భద్రతా బలగాలు ఆయనను టెహ్రాన్ నుంచి ఒక అత్యంత సురక్షితమైన, రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నప్పటికీ ఆయన ప్రధాన కార్యాలయం దెబ్బతినడం ఇరాన్ పరువుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
ఇజ్రాయెల్‌లో స్టేట్ ఆఫ్ ఎమర్జన్సీ
టెహ్రాన్‌పై దాడులు ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్ నుంచి క్షిపణుల రూపంలో ఎదురు దాడి జరిగే అవకాశం ఉందని భావించిన రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, దేశవ్యాప్తంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
ఇజ్రాయెల్ అంతటా ముఖ్యంగా జెరూసలేం పరిసర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగించారు. ప్రతి పౌరుడి మొబైల్ ఫోనకు నేరుగా ఐడీఎఫ్ నుంచి అడ్వాన్స్‌డ్ ఇన్‌స్ట్రక్షన్ అలర్ట్స్ వెళ్లాయి. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు లేదా బాంబ్ షెల్టర్లకు దగ్గరగా ఉండాలని సైన్యం ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయెల్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది.
అమెరికా ఎందుకు రంగంలోకి దిగింది?
ఈ దాడికి కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న అణు చర్చల పట్ల తాను ఏ మాత్రం సంతృప్తిగా లేనని, ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇరాన్‌లో జరిగిన ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో సుమారు 32వేల మంది ఇరానియన్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
Frequently Asked Questions
టెహ్రాన్‌లో ఏం జరిగింది?
ఈ దాడుల వెనుక ఎవరున్నారు?
ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతోపాటు అమెరికా వైమానిక దళం కూడా ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. ఇరాన్‌కు పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకే ఈ దాడి జరిగింది.
సుప్రీం నాయకుడు ఖమేనీ సురక్షితంగా ఉన్నారా?
దాడికి ముందే ఇరాన్ భద్రతా బలగాలు ఆయనను టెహ్రాన్ నుంచి ఒక రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నప్పటికీ ఆయన ప్రధాన కార్యాలయం దెబ్బతినడం ఇరాన్ పరువుకు దెబ్బ.
ఇజ్రాయెల్‌లో ఎందుకు అత్యవసర పరిస్థితి ప్రకటించారు?
ఇరాన్ నుంచి ఎదురు దాడి జరిగే అవకాశం ఉందని భావించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సైన్యం ఆదేశించింది.























