అన్వేషించండి

Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం

Kakinada explosion : కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో విషాద ఘటన జరిగింది. వేట్లపాలెం - మేడపాడు గ్రామాల మధ్య ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది.

Massive explosion at Samarlakota fireworks manufacturing facility: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెం,  మేడపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి తయారీ కేంద్రం పూర్తిగా నేలమట్టమైంది.                       
 
మధ్యాహ్నం సమయంలో కార్మికులు బాణసంచా తయారీలో నిమగ్నమై ఉండగా, ఒక్కసారిగా మందుగుండు సామాగ్రికి నిప్పు అంటుకుని పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత  భయంకరంగా ఉంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు మొదట్లో ఆటంకం కలిగింది. భయంకరమైన మంటలు చెలరేగడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
 
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నం చేయగా, అప్పటికే 10 మంది మృతదేహాలు ఛిద్రమై కనిపించాయి. గాయపడిన వారిని వెంటనే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి  తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళా కార్మికులే ఉన్నట్లు సమాచారం.
 
ఈ బాణసంచా కేంద్రం అనుమతులతో నడుస్తుందా లేదా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం, రసాయనాల మిశ్రమం కలిపే సమయంలో తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితుల వివరాలను సేకరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది.

గతంలోనూ ఇదే ప్రాంతంలో ఘోర ప్రమాదాలు

సామర్లకోట  పరిసర ప్రాంతాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు అధికంగా ఉండటం వల్ల గతంలోనూ పలుమార్లు ఇక్కడ ఘోర ప్రమాదాలు సంభవించాయి. 2014 అక్టోబర్‌లో సామర్లకోట సమీపంలోని వకాడ వద్ద ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో సుమారు 11 మంది కార్మికులు  సజీవ దహనమయ్యారు. దీపావళి సీజన్ కావడంతో భారీగా నిల్వ ఉంచిన మందుగుండు సామాగ్రి ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ భూమిని తలపించింది. అప్పట్లో కూడా మృతుల్లో ఎక్కువ మంది పేద మహిళా కార్మికులే ఉన్నారు.  2017, 2020 సంవత్సరాల్లో కూడా సామర్లకోట పరిసర గ్రామాల్లోని చిన్న చిన్న తయారీ యూనిట్లలో పేలుళ్లు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, మరికొందరు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా జనవాసాల మధ్య తయారీ సాగించడం, రసాయనాల మిశ్రమం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. ప్రతి ప్రమాదం జరిగినప్పుడు అధికారులు తనిఖీలు చేపట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో భద్రతా ప్రమాణాల లోపం వల్ల సామర్లకోట ప్రాంతంలో ఈ మృత్యు ఘోష కొనసాగుతూనే ఉంది.

టాప్ హెడ్ లైన్స్

RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Chandrababu And Pawan Kalyan Meeting: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
YSRCP North Andhra Crisis: ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?
ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
TGERC True Up Charges: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
Embed widget