అన్వేషించండి

Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

Bladder Pain or UTI : మూత్రాశయం నొప్పిని చాలామంది మహిళలు నిర్లక్ష్యం చేస్తారని.. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌కు, బ్లాడర్ పెయిన్​ మధ్య తేడ గుర్తించక ఇబ్బందులు ఎదుర్కొంటారని వైద్యులు చెప్తున్నారు.

Frequent Urination and Bladder Pain in Women : చాలామంది మహిళలు మూత్రాశయం నొప్పితో నెలలు, కొన్నిసార్లు ఏళ్లపాటు కూడా బాధపడుతుంటారు. అయినప్పటికీ అసలు సమస్య ఏమిటో గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. దీనికి ప్రధాన కారణం ఇంటర్‌స్టీషియల్ సిస్టైటిస్/బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ (Interstitial Cystitis/Bladder Pain Syndrome - IC/BPS) లక్షణాలు సాధారణంగా కనిపించే ఇతర వ్యాధుల లక్షణాలతో పోలి ఉండటమేనని యశోద హాస్పిటల్స్, హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ ఎం. గోపిచంద్ తెలిపారు.

ఈ సమస్యను చాలామంది యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI), ఓవర్‌యాక్టివ్ బ్లాడర్ లేదా స్త్రీల గైనకాలజీ సమస్యగా భావించి చికిత్స తీసుకుంటారని వెల్లడించారు. దీంతో అసలు సమస్య గుర్తించే సరికి ఆలస్యం అవుతుందని తెలిపారు. ఇన్‌ఫెక్షన్ లేకపోయినా పలుమార్లు యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మూత్రాశయం నొప్పిని ఎప్పుడూ సాధారణ సమస్యగా తీసుకోవద్దని డాక్టర్ గోపిచంద్ హెచ్చరిస్తున్నారు.

Also Read : యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏమి చేయాలి? ప్రతి మహిళ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ లక్షణాలు ఇవే..

బ్లాడర్ పెయిన్ సమస్య ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రాశయం లేదా పెల్విక్ ప్రాంతంలో నొప్పి, ఒత్తిడి లేదా అసౌకర్యం.. పగలు, రాత్రి తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం.. ఒక్కసారిగా మూత్రం చేయాలనే తీవ్రమైన కోరిక కలగడం కానీ ప్రతిసారి చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే మూత్రం వస్తుంది. మూత్రాశయం నిండినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండి.. మూత్ర విసర్జన తర్వాత తగ్గిపోతుంది. కొంతమంది మహిళల్లో శృంగార సమయంలో నొప్పిగా ఉంటుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌కు, బ్లాడర్ పెయిన్​కి మధ్య తేడాలివే

సాధారణ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కానీ బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్‌కు బ్యాక్టీరియా కారణం కాదని డాక్టర్ గోపిచంద్ తెలిపారు. అందువల్ల మూత్ర పరీక్షల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు సాధారణంగా కనిపించదన్నారు. ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ పూర్తిగా తెలియదు. అయితే.. మూత్రాశయం లోపలి పొరలో మార్పులు రావడం, నరాల సంకేతాలు అసాధారణంగా పనిచేయడం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అలర్జీలు, దీర్ఘకాలిక వాపు వంటి అంశాలు దీనికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read : మహిళలు 40 దాటాక తప్పక మార్చుకోవాల్సిన అలవాట్లు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి

ఈ వ్యాధిని ఎలా గుర్తిస్తారంటే..

ఈ సమస్యను నిర్ధారించడానికి ఒక్కటే పరీక్ష ఉండదు. అందువల్ల ముందుగా ఇతర వ్యాధులను తొలగించిన తర్వాతే వైద్యులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. పదేపదే వచ్చే యూరిన్ ఇన్‌ఫెక్షన్లు, మూత్రాశయంలో రాళ్లు, ఎండోమెట్రియోసిస్, మూత్రాశయ క్యాన్సర్ వంటి సమస్యలు లేవని నిర్ధారించిన తర్వాత మాత్రమే బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్‌గా నిర్ధారణ చేస్తారు.

బ్లాడర్ పెయిన్ చికిత్స ఉందా?

ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేకపోయినా, లక్షణాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని డాక్టర్ గోపిచంద్ తెలిపారు. ప్రతి రోగి పరిస్థితిని బట్టి చికిత్స ఉంటుందని తెలిపారు నిపుణులు. కాఫీ, ఆల్కహాల్, మసాలా ఎక్కువగా ఉండే ఆహారం, పుల్లటి పానీయాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపీ, బ్లాడర్ ట్రైనింగ్, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు, అవసరమైతే మందులు, కొందరికి బ్లాడర్ ఇన్‌స్టిలేషన్ థెరపీ, నర్వ్ స్టిమ్యులేషన్, బొటాక్స్ థెరపీ చికిత్స చేస్తారు.

Also Read : రక్తహీనత దూరం కావాలంటే.. మహిళలు తప్పక తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

మూత్రాశయం నొప్పి లేదా తరచుగా మూత్రానికి వెళ్లాలనే సమస్య ఆరు వారాలకుపైగా కొనసాగితే కచ్చితంగా యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. చికిత్స తీసుకున్నా సమస్య తగ్గకపోతే.. మూత్ర పరీక్షల్లో ఇన్‌ఫెక్షన్ లేదని వచ్చినా లక్షణాలు కొనసాగినా.. వైద్య సహాయం తీసుకోవాలి. 

మూత్రాశయం నొప్పిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్ లేదని పరీక్షల్లో వచ్చినప్పటికీ నొప్పి, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రాశయం నిండినప్పుడు నొప్పి పెరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రారంభ దశలోనే సరైన నిర్ధారణ, తగిన చికిత్స తీసుకోవడం వల్ల జీవన నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడుతుందని అంటున్నారు. 

Also Read : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget