అన్వేషించండి

Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

Tips to Quality Sleep : రాత్రుళ్లు నిద్ర రావడం కష్టంగా ఉందా? అయితే మీరు కచ్చితంగా మంచి నైట్ రొటీన్ సెట్ చేసుకోవాలని అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మంచి నిద్రకు శరీరం, మనస్సు సిద్ధమవాలని నిపుణులు సూచించారు.
  • నిర్ణీత సమయానికి పడుకొని, నిద్రకు ముందు స్క్రీన్లకు దూరంగా ఉండాలి.
  • ప్రశాంత వాతావరణం, తేలికపాటి ఆహారం మంచి నిద్రకు దోహదపడతాయి.
  • నిద్రలేమి సమస్యలు కొనసాగితే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.

Night Routine for Quality Sleep : రోజంతా పనులతో బిజీగా గడిపిన తర్వాత కూడా చాలామంది రాత్రి పడుకున్నా వెంటనే నిద్ర రాదని చెబుతుంటారు. ఆ సమయంలో కొందరు గంటల తరబడి ఫోన్ చూస్తూ గడిపేస్తారు. మరికొందరు అర్ధరాత్రి వరకు టీవీ చూస్తారు. అయితే మంచి నిద్ర అనేది ఒక్కసారిగా వచ్చేది కాదని నిపుణులు చెప్తున్నారు. శరీరానికి, మెదడుకు విశ్రాంతి తీసుకునే సంకేతాలు అందినప్పుడే సహజంగా నిద్ర వస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు కొన్ని మంచి అలవాట్లను పాటించడం ముఖ్యమని తెలిపారు. 

"మంచి నైట్ రొటీన్ అంటే పడుకునే ముందు ఎక్కువ పనులు చేసుకోవడం కాదు. శరీరం, మెదడు నిద్రకు సిద్ధమయ్యేలా సమయం ఇవ్వడమే అసలు ఉద్దేశం. ప్రతిరోజూ కొన్ని సాధారణ అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది" అని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కె. శేషి కిరణ్ తెలిపారు. ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

ఒకే సమయానికి నిద్రపోండి

ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో నిద్రలేవడం వల్ల శరీరంలోని సర్కేడియన్ రిథమ్ సక్రమంగా పనిచేస్తుంది. వారాంతాల్లో కూడా ఈ సమయాన్ని వీలైనంత వరకు మార్చకుండా ఉంటే సహజంగా నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది.

పడుకునే ముందు ప్రశాంతంగా ఉండాలట

పడుకునే ముందు కనీసం అరగంట నుంచి గంట సమయం వరకు శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఈ సమయంలో పని ఒత్తిడి, ఆఫీస్ చర్చలు లేదా మానసిక ఆందోళన కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది.

మొబైల్, టీవీకి దూరంగా ఉండండి

ఫోన్, ట్యాబ్లెట్, టీవీ వంటి డిజిటల్ స్క్రీన్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉంది. అందుకే పడుకునే ముందు స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం వల్ల నిద్ర త్వరగా పట్టే అవకాశం ఉంటుంది.

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

రిలాక్స్ అయ్యే పనులు 

పడుకునే ముందు పుస్తకం చదవడం, మెల్లగా స్ట్రెచింగ్ చేయడం, డీప్ బ్రీతింగ్, ధ్యానం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం వంటి అలవాట్లు నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి మంచి నిద్రకు సహాయపడతాయి.

డిన్నర్ విషయంలో జాగ్రత్త

పడుకునే సమయానికి దగ్గరగా ఎక్కువగా తినడం, కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకోవడం లేదా తీవ్రమైన వ్యాయామం చేయడం నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. ఒకవేళ ఆకలిగా అనిపిస్తే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

గోరువెచ్చని నీటితో స్నానం 

పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా షవర్ తీసుకోవడం మంచిది. ఇది కొందరిలో శరీర ఉష్ణోగ్రతను సహజంగా తగ్గించి నిద్రకు శరీరాన్ని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.

Also Read : శరీరం అలసిపోయినా నిద్ర రాకపోవడానికి కారణాలు ఇవే.. ఈ టిప్స్​తో బాడీకి రెస్ట్ ఇచ్చేయండి

బెడ్‌రూమ్ సెటప్

పడకగది చల్లగా, నిశ్శబ్దంగా, చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుతురు, శబ్దం లేదా ఇతర అంతరాయాలు వస్తే నిద్ర నాణ్యతను తగ్గిపోవచ్చు. కాబట్టి నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరం.

ఒక్కసారిగా మార్చేయకండి..

నైట్ రొటీన్‌ను ఒకేసారి పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. మొదట ఒకటి లేదా రెండు మంచి అలవాట్లతో ప్రారంభించి వాటిని ప్రతిరోజూ పాటించండి. కొంతకాలానికి మెదడు ఈ అలవాట్లను నిద్రతో అనుసంధానం చేసుకుంటుంది. దీంతో త్వరగా నిద్ర పట్టడంతో పాటు నాణ్యమైన నిద్ర కూడా లభిస్తుంది.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలంటే..

కొన్ని వారాల పాటు మంచి నిద్ర అలవాట్లు పాటించినా కూడా నిద్ర రాకపోవడం, రాత్రిపూట తరచూ మెలకువ రావడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉండటం వంటి సమస్యలు కొనసాగితే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఇవి నిద్ర సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్, హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget