అన్వేషించండి

Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

Using Phone Right After Waking Up : నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? అయితే మీ రోజూవారీ అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపానికి కారణం ఇదే కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నిద్రలేవగానే ఫోన్ వాడకం మెదడుపై ఒత్తిడి పెంచి ఏకాగ్రత తగ్గిస్తుంది.
  • తలనొప్పి, అలసట, డోపమైన్ పెరుగుదల వంటి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు.
  • ఫోన్ బ్లూ లైట్ సిర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తుంది; జాగ్రత్తలు తీసుకోండి.
  • ఉదయాన్నే నీరు తాగి, వెలుతురులో నిలబడి, తేలికపాటి వ్యాయామం చేయండి.

Staying Away From Your Phone After Waking Up : ఉదయం నిద్రలేవగానే చాలా మంది చేసే మొదటి పని ఏంటంటే.. మొబైల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా, న్యూస్ లేదా ఇమెయిల్స్ చెక్ చేస్తారు. ఈ అలవాటు సాధారణంగా కనిపించినా.. ఇది రోజంతా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

నిద్రలేవగానే ఫోన్ ఎందుకు చూడకూడదంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రలేవగానే మన మెదడు పూర్తిగా యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లదు. ఆ సమయంలో మెదడు నెమ్మదిగా విశ్రాంతి స్థితి నుంచి మేల్కొనే ప్రక్రియలో ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా ఫోన్‌లో నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, సోషల్ మీడియా కంటెంట్ చూడడం వల్ల మెదడుపై ఒక్కసారిగా ఎక్కువ సమాచారం పడుతుంది. దీంతో నాడీ వ్యవస్థ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. 

Also Read : ఉదయాన్నే కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. గుండెపోటు హెచ్చరికలు కావచ్చు

డోపమైన్ లెవెల్స్ పెరిగితే..

ఉదయం లేవగానే ఫోన్ చూస్తే మెదడులో డోపమైన్ అనే రసాయనం ఒక్కసారిగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫోన్‌ను పదేపదే చెక్ చేయాలనే అలవాటు పెరగడంతో పాటు, రోజంతా ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

తలనొప్పి, అలసటకు ఇదే కారణమా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫోన్‌ను ఉదయం ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కొందరిలో తలనొప్పి, కళ్లపై ఒత్తిడి, మానసిక అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే ఇవి ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉండవు. స్క్రీన్‌ను ఎంతసేపు చూస్తున్నారు? నిద్ర ఎంత బాగా పట్టింది.. వంటి అంశాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది.

Also Read : జీవితాన్ని మార్చేసే మార్నింగ్ రొటీన్.. ఉదయాన్నే కేవలం 30 నిమిషాలు కేటాయిస్తే చాలు!

బ్లూ లైట్ ప్రభావం 

మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ శరీరంలోని సిర్కాడియన్ రిథమ్​పై ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదయం లేవగానే ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే మెదడు సహజంగా మేల్కొనే ప్రక్రియలో అంతరాయం కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మెటబాలిజంపై ప్రభావం

కొంతమంది నిపుణులు మొబైల్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మెటబాలిజంపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. అయితే ఈ అంశంపై శాస్త్రీయమైన ఆధారాలు స్పష్టంగా లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశోధనల్లో దీనిపై ఏకాభిప్రాయం కూడా లేదు. 

Also Read : ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా? లేక ముందే తాగేస్తున్నారా? ఏది మంచిది?

ఉదయం లేవగానే ఏమి చేస్తే మంచిది?

నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడకుండా కనీసం 20 నుంచి 30 నిమిషాలు గ్యాప్ తీసుకోండి. అలాగే ఒక గ్లాస్ నీరు తాగండి. కిటికీలు తెరిచి సహజమైన వెలుతురులో కొద్దిసేపు ఉండండి. 5 నుంచి 10 నిమిషాలు స్ట్రెచింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే మంచిది. అలాగే డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానం చేయండి. ఫోన్ చూసే ముందు బ్రేక్​ఫాస్ట్​ కూడా పూర్తి చేస్తే మంచిదని చెప్తున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget