అన్వేషించండి

Drinking Water Tips : ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా? లేక ముందే తాగేస్తున్నారా? ఏది మంచిది?

Right Time to Drink Water in the Morning : ఉదయాన్నే బ్రష్ చేయకముందు నీళ్లు తాగితే ప్రమాదమా? నోటి పరిశుభ్రత, దంత ఆరోగ్యం కోసం.. నీటిని బ్రష్ చేయకముందు తాగాలో.. చేశాక తాగాలో తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉదయం లేవగానే నీరు తాగే విషయంలో భిన్న అభిప్రాయాలున్నాయి.
  • దంతాల పరిశుభ్రతకు బ్రష్ చేసిన తర్వాత తాగడం మేలని నిపుణులు.
  • బ్రష్ చేయకుండా దాహమైతే కొద్దిగా నీరు తాగవచ్చని వైద్యులు తెలిపారు.
  • అయితే, రోజులో శరీరానికి సరిపడా నీరు తాగడం ఎంతో ముఖ్యం.

Water Before Brushing vs After Brushing : ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తారు. అలాగే చాలామంది తెలియకుండానే దీనిని ఫాలో అవుతూ ఉంటారు. కొందరు నిద్రలేవగానే నీటితో తమ రోజును ప్రారంభిస్తే.. మరికొందరు బ్రష్ చేసే వరకు నీటిని కూడా ముట్టరు. ఇంతకీ బ్రష్ చేసిన తర్వాత నీళ్లు తాగాలా? లేక ముందే తాగేయొచ్చా? ఏది ఆరోగ్యానికి మంచిది?  

బ్రష్ చేసిన తర్వాతే నీళ్లు తాగాలని కొందరు సూచిస్తారు. నిద్రలేవగానే నీళ్లు తాగాలని మరికొందరు చెప్తారు. మరి దీనిలో ఏది సరైన పద్ధతి? బ్రష్ చేయకముందు నీళ్లు తాగాలా? లేక బ్రష్ చేసిన తర్వాత తాగాలా? ఈ డౌట్ చాలామందిలో ఉంటుంది. ఈ విషయంపై దంత వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

బ్రష్ చేయకముందు నీళ్లు తాగొచ్చా?

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఉదయం నిద్రలేచిన వెంటనే.. బ్రష్ చేయకుండానే కొద్దిగా నీరు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది, హానీ ఇండదని చెప్తున్నారు నిపుణులు. రాత్రంతా నిద్రపోవడం వల్ల శరీరం కొంత డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో నీరు తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందుతుంది.

అయితే రాత్రి సమయంలో నోటిలో బ్యాక్టీరియా కూడా పెరుగుతాయి. అందుకే కొందరు నిపుణులు బ్రష్ చేసిన తర్వాత నీళ్లు తాగడం మరింత పరిశుభ్రమైన అలవాటు అని సూచిస్తారు. 

బ్రష్ చేసిన తర్వాత నీళ్లు తాగితే.. 

బ్రష్ చేయడం వల్ల రాత్రంతా నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఆహార అవశేషాలు తొలగిపోతాయి. దీంతో నీళ్లు తాగేటప్పుడు నోరు మరింత పరిశుభ్రంగా ఉంటుంది. ఉదయాన్నే నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రష్ చేసిన తర్వాత నీళ్లు తాగడం వల్ల నోటిలో తాజాగా అనిపిస్తుంది. అయితే బ్రష్ చేసేప్పుడు పేస్ట్ నోటిలో ఉండిపోకుండా.. పాచి లేకుండా శుభ్రం చేసుకుని నీరు తాగితే మంచిది.

బ్రష్ చేయకముందు తాగితే మంచిది కాదా?

చాలామందిలో బ్రష్ చేయకముందు ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రావు. అయితే దీనివల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెప్పే బలమైన శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు.

నిపుణులు ఏమంటున్నారంటే..

దంతాల ఆరోగ్యం పరంగా చూస్తే బ్రష్ చేసిన తర్వాత నీళ్లు తాగడం మంచిదని చాలామంది దంత వైద్యులు సూచిస్తారు. అయితే ఉదయం లేవగానే దాహంగా అనిపిస్తే బ్రష్ చేయకముందు కొద్దిగా నీరు తాగడం వల్ల ఎలాంటి హాని ఉండదని తెలిపారు. కాబట్టి బ్రష్ చేయకముందు కొన్ని.. బ్రష్ చేశాక కొన్ని తాగవచ్చు. అలాగే పూర్తి ఆరోగ్యం కోసం రోజంతా శరీరానికి సరిపడా నీటిని తీసుకుంటే మంచిది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
Embed widget