రోజును పాజిటివ్​గా ప్రారంభించాలంటే.. ఉదయాన్నే ఇవి ట్రై చేయండి

Published by: Geddam Vijaya Madhuri

మీ డేని పాజిటివ్​గా ప్రారంభించాలంటే.. నిద్రలేచిన వెంటనే మీతో మీరు ఈ విషయాలు చెప్పుకోండి.

ఈ రోజు నాకు కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ప్రతి ఉదయం కొత్త ప్రారంభమే కాబట్టి నేను ఈ రోజును ఆత్మవిశ్వాసంతో స్వాగతిస్తున్నాను.

నేను వీక్ కాదు. బలమైన వ్యక్తిని. ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం నాలో ఉన్నాయి.

నా ఆరోగ్యం, నా ఆనందం నాకు చాలా ముఖ్యం. కాబట్టి నా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే నిర్ణయాలు నేను తీసుకుంటాను.

నేను నా లక్ష్యాల వైపు ముందుకు వెళ్తున్నాను. నేను వేసే ప్రతి చిన్న అడుగు నన్ను నా విజయానికి మరింత దగ్గర చేస్తుంది.

నేను నన్ను నేను గౌరవిస్తాను. నా విలువను నేను గుర్తిస్తాను. నా సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది.

ఈ రోజు నేను సానుకూల ఆలోచనలతో ఉంటాను. నెగిటివిటీని పక్కనపెట్టి మంచి విషయాలపై దృష్టి పెడతాను.

నేను ప్రశాంతంగా, బ్యాలెన్స్​గా ఉంటాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా స్పందించగలను.

నా జీవితంలో ఉన్న మంచి విషయాలకు నేను కృతజ్ఞతతో ఉంటాను. నాకు లభించిన అవకాశాలు, సంబంధాలు, అనుభవాలు చాలా గొప్పవి.

నేను తప్పుల నుంచి కొత్త పాఠాన్ని నేర్చుకుంటూ.. ఎదుగుతూ ఉంటాను. నిరంతరం అభివృద్ధి చెందడమే నా లక్ష్యం.

ఈ రోజు మంచి రోజు అవుతుంది. మంచి విషయాలు నా వైపు వచ్చేలా ఈ యూనివర్స్ చేస్తుంది.