కాఫీ పొడి గాయాలకు రాస్తే నిజంగానే తగ్గిపోతాయా? నిజాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల గాయాలు త్వరగా మానుతాయని కొందరు భావిస్తారు.

అందుకే ఇంటి చిట్కాగా చిన్నపాటి గీతలు లేదా స్వల్ప గాయాలపై కాఫీ పొడిని ఇప్పటికీ కొందరు అప్లై చేస్తారు.

అయితే కాఫీ పొడి స్టెరైల్ కాదు. గాయంపై నేరుగా వేస్తే బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

కొంతమందిలో కాఫీ పొడి వల్ల చర్మం ఎర్రబడటం, మంట లేదా అలర్జీ వంటి సమస్యలు రావచ్చు.

లోతైన గాయాలు, కోతలు, కాలిన గాయాలపై కాఫీ పొడిని ఉపయోగించడం ప్రమాదకరం కావచ్చు.

కాఫీ పొడి రక్తస్రావాన్ని ఆపుతుందని కొన్ని ప్రచారాలు ఉన్నప్పటికీ.. దీనిని నిర్ధారించే తగిన వైద్య ఆధారాలు లేవు.

గాయం మానాలంటే ముందుగా శుభ్రమైన నీటితో కడిగి, అవసరమైతే యాంటిసెప్టిక్ వాడటం మంచిది.

కాఫీ పొడి ఎప్పటికీ సరైన వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.

వాపు, పుళ్లు, అధిక నొప్పి, రక్తస్రావం లేదా జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

కాఫీలోని కొన్ని సమ్మేళనాలు గాయాల మాన్పులో ఉపయోగపడతాయా అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఎలాంటి నిర్ధారణ లేదు.