అన్వేషించండి

Morning Routine : జీవితాన్ని మార్చేసే మార్నింగ్ రొటీన్.. ఉదయాన్నే కేవలం 30 నిమిషాలు కేటాయిస్తే చాలు!

Morning Habits : ఉదయాన్నే మంచి రొటీన్​తో రోజును ప్రారంభిస్తే.. వారు రోజంతా హెల్తీ ఫుడ్, మంచి అలవాట్లు పాటించే అవకాశం ఎక్కువగా ఉందట. ఈ మార్నింగ్ రొటీన్ ఎలా సెట్ చేసుకోవాలంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పనుల ప్రణాళిక, వ్యాయామం ఉత్పాదకతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.

30-Minute Morning Routine : ఉదయం లేవగానే మనం చేసే పనులే రోజంతా మన మూడ్, వర్క్, ఎఫర్ట్స్​పై ప్రభావం చూపుతాయి. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే.. ఉదయం ఆలస్యంగా లేచి హడావుడిగా రోజును ప్రారంభిస్తుంటారు. అయితే నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు కేటాయించి ఒక హెల్తీ మార్నింగ్ రొటీన్‌ను ఫాలో అయితే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.

మార్నింగ్ రొటీన్ అంటే గంటల తరబడి వ్యాయామం చేయడం లేదా కఠినమైన నియమాలు పాటించడం కాదు. కేవలం 30 నిమిషాలు ప్రశాంతంగా, మంచి రొటీన్​తో గడపడం. దీనివల్ల మీ రోజును, క్రమంగా మీ జీవితాన్నే మెరుగుపరుచుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. చిన్న అలవాట్లతో మొదలుపెట్టి వాటిని నిరంతరం కొనసాగిస్తే దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలను పొందవచ్చు. ఇంతకీ ఆ రోటీన్​ ఏంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

ప్రశాంతంగా స్టార్ట్ చేయండి..

ఉదయం లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం వల్ల మెదడుపై ఒత్తిడి లేకుండా రోజును ప్రారంభించగలుగుతుంది. దీంతో ఆందోళన, టెన్షన్ తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

కావాల్సిన ఎనర్జీ..

ఉదయాన్నే ఒక గ్లాస్ నీరు తాగడం, తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుగా మారుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఏకాగ్రత పెరుగుతుంది

ధ్యానం, డీప్ బ్రీతింగ్ వంటి అలవాట్లను మార్నింగ్ రొటీన్‌లో భాగం చేసుకుంటే మెదడు మరింత ఫోకస్ అవుతుంది. దీంతో పనులపై ఏకాగ్రత పెరుగుతుంది.

మూడ్ మెరుగుపడుతుంది

ఉదయాన్నే ఎండలో లేదా.. రూమ్ నుంచి బయటకు వచ్చి కాసేపు ప్రకృతిలో గడపడం వల్ల శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మూడ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ప్రొడెక్టివిటీ పెరుగుతుంది

మీరు ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల సమయాన్ని సమర్థవంతంగా వాడుకోగలుగుతారు. దీంతో మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

మార్నింగ్ రొటీన్‌లో జర్నలింగ్ లేదా థ్యాంక్యూ నోట్స్ రాసుకోవడం వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

శారీరక ఆరోగ్యం

నడక, స్ట్రెచింగ్ లేదా యోగా వంటి కార్యకలాపాలు కండరాలను చురుకుగా ఉంచి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే ప్రతిరోజూ ఒక క్రమపద్ధతిని పాటించడం వల్ల సెల్ఫ్ కంట్రోల్ కూడా పెరుగుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి లక్ష్యాల సాధనలో సహాయపడుతుంది.

రోజుకు కేవలం 30 నిమిషాలు మీకోసం కేటాయించడం చిన్న విషయంగా అనిపించినా.. దీని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఉత్పాదకత, జీవన నాణ్యత వంటి అనేక అంశాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget