అన్వేషించండి

Night Routine Habits : మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే

Night Routine : రాత్రుళ్లు గాఢ నిద్రతో పాటు.. ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నైట్ రొటీన్ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. రాత్రుళ్లు పడుకునే ముందు ఈ పనులు చేయాలంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రశాంత పనులు, నిశ్శబ్ద గది నిద్ర నాణ్యతను పెంచుతాయి.

Healthy Night Habits For Better Sleep : ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటికి కారణం కేవలం పగటి సమయంలో ఎదురయ్యే ఒత్తిడి మాత్రమే కాదని చెప్తున్నారు నిపుణులు. రాత్రుళ్లు ఫాలో అయ్యే కొన్ని అలవాట్లు కూడా మానసిక ఆరోగ్యంపై గణనీయంగా ప్రభావం చూపుతాయని అంటున్నారు. మంచి నైట్ రొటీన్ అనేది ఎక్కువసేపు నిద్రపోవడానికే కాదని.. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు. 

రోజంతా పనిచేసిన మెదడు, శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లేలా చేయడం మన బాధ్యత అని.. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. సరైన నిద్ర అలవాట్లు లేకపోతే ఒత్తిడి, చిరాకు, ఆందోళన పెరిగి.. ఏకాగ్రత లోపం, భావోద్వేగ అలసట వంటి మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ప్రతిరోజూ ఒకే సమయం..

ప్రతిరోజూ నిద్ర వచ్చినా రాకున్నా.. ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో లేవడాన్ని శరీరానికి అలవాటు చేయాలని తెలిపారు. దీనివల్ల శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సమతుల్యంగా పనిచేస్తుంది. నిద్ర సమయాల్లో తరచూ మార్పులు చేస్తే.. మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్ నవీన్ కుమార్ హెచ్చరించారు.

గంట ముందు నో స్క్రీన్

మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వంటి డిజిటల్ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్ర పట్టడం ఆలస్యమవుతుంది. అందుకే నిద్రకు కనీసం గంట ముందు స్క్రీన్ల వినియోగాన్ని తగ్గించడం మంచిదని సూచించారు.

ప్రశాంతతనిచ్చే పనులు

పడుకునే ముందు పుస్తకం చదవడం, డైరీ రాయడం, మంచి సంగీతం వినడం, ధ్యానం లేదా డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి.

డైరీ లేదా జర్నల్

చాలామంది రాత్రుళ్లు రేపు చేయాల్సిన పనులు, సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో చేయాల్సిన పనుల జాబితాను ముందుగానే రాయడం లేదా థ్యాంక్స్ నోట్స్ రాసుకుంటే మనసు తేలికపడుతుందని చెప్తున్నారు.

నిద్రకు అనుకూలమైన రూమ్

మీరు పడుకోవాలి అనుకున్నప్పుడు గది చీకటిగా, ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. సౌండ్స్, అధిక వెలుతురు, వేడి వాతావరణం నిద్ర నాణ్యతను తగ్గించవచ్చు. కాబట్టి గదిలో అవి లేకుండా చూసుకోవాలి. మంచి నిద్రలో గది కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు డాక్టర్ నవీన్ కుమార్. 

కెఫిన్ తగ్గించాలి

కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ కలిగిన పానీయాలను సాయంత్రం తర్వాత తీసుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. అందుకే రాత్రి సమయంలో వీటికి దూరంగా ఉండటం మంచిదని చెప్తున్నారు నిపుణులు.

ఎక్కువగా తినకండి

నిద్రకు ముందు ఎక్కువ భోజనం చేయడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీంతో అసౌకర్యం కలిగి నిద్రకు అంతరాయం కలగవచ్చు. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

వ్యాయామాలు వద్దు

వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. నిద్రకు ముందు అధిక శారీరక శ్రమ చేస్తే శరీరం మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఇది నిద్రను ప్రభావితం చేయవచ్చు.

నిద్ర సమయంలో మెదడు మన ఎమోషన్స్, భావోద్వేగాలను ప్రాసెస్ చేస్తుంది. జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది. మానసిక శక్తిని పునరుద్ధరిస్తుంది. కాబట్టి ప్రతి రాత్రి మంచి నైట్ రొటీన్‌ సెట్ చేసుకుని.. దానిని ఫాలో అవ్వడం వల్ల మూడ్ మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం కూడా బెటర్ అవుతాయి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో గొప్ప ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Cigarette Cravings : సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
Curry Leaf Oil For Hair : కరివేపాకులు తెల్లజుట్టును నల్లగా మార్చేస్తాయా? ఇంట్లోనే కరివేపాకు నూనె ఇలా చేసుకోండి
కరివేపాకులు తెల్లజుట్టును నల్లగా మార్చేస్తాయా? ఇంట్లోనే కరివేపాకు నూనె ఇలా చేసుకోండి
High Cholesterol : భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
Cough and Cold in Kids : చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget