అన్వేషించండి

Alzheimers Diet : మాంసం తింటే జ్ఞాపకశక్తి పెరిగి, అల్జీమర్స్ ప్రమాదం తగ్గుతుందట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు

Memory with Meat : అల్జీమర్స్, డిమెన్షియా ప్రమాదం ఉన్నవారు తమ డైట్లో మాంసం చేర్చుకుంటే చాలామంచిదని తాజా అధ్యయనం చెప్తుంది. ఇది ఎంతవరకు నిజమో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అల్జీమర్స్ జన్యువు ఉన్నవారిలో మాంసాహారం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • అధ్యయనంలో ఎక్కువ మాంసం తిన్నవారిలో డిమెన్షియా ప్రమాదం తగ్గింది.
  • ప్రాసెస్ చేయని మాంసం మెదడుకు మేలు చేస్తుంది, విటమిన్ B12 కీలకం.
  • జీవనశైలి, ఆహారం మెదడు ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడతాయి.

Meat Consumption Improve Brain Health : మీ శరీరంలో అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న జన్యువు ఉంటే.. మీరు తీసుకునే ఆహారంలో చిన్న మార్పు చేయాలని అంటున్నారు. దీంతో డిమెన్షియా ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని అంటున్నారు. క్రమం తప్పకుండా మాంసం తినేవారిలో జ్ఞాపకశక్తి బలహీనపడటం, డిమెన్షియా వచ్చే ప్రమాదం దాదాపు సగానికి తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.

శాస్త్రవేత్తల ప్రకారం.. APOE అనే జన్యువు అల్జీమర్‌తో ముడిపడి ఉంది. ఇది చాలా కేసులలో కనిపిస్తుంది. ముఖ్యంగా APOE4 వేరియంట్ ఉన్నవారిలో డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి వారు తమ డైట్లో మాంసం తీసుకోవడం పెంచితే.. దాని సానుకూల ప్రభావం వారి మెదడుపై పడుతుందని పరిశోధనలో తేలినట్లు గుర్తించారు.

పరిశోధనలో ఏమి కనుగొన్నారంటే..

ఈ అధ్యయనాన్ని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించారు. ఇందులో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 2000 మందికి పైగా వ్యక్తులను దాదాపు 15 సంవత్సరాల పాటు ట్రాక్ చేశారు. ఈ సమయంలో వారి ఆహారపు అలవాట్లను గమనించారు. ముఖ్యంగా మాంసం తీసుకోవడంపై దృష్టి పెట్టారు. దీంతో పరిశోధన ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి. APOE4 జన్యువు ఉన్నా.. ఎక్కువ మాంసం తినేవారిలో డిమెన్షియా వచ్చే ప్రమాదం తగ్గిందని గుర్తించారు. అంతేకాకుండా వారి ఆలోచనా సామర్థ్యం కూడా మెరుగైనట్లు గుర్తించారు. అలాగే మానసిక క్షీణత నెమ్మదించింది. 

మాంసం తింటే మంచిదే కానీ..

ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే మాంసం మంచిది కదా అని అన్ని రకాల మాంసం తినకూడదట. ప్రాసెస్ చేసిన మాంసం, బేకన్, సాసేజ్ లేదా ఎక్కువ ప్రాసెస్ చేసిన మాంసం మెదడుకు హానికరమై డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతాయట. అంటే మీరు ప్రయోజనం కావాలనుకుంటే.. ప్రాసెస్ చేయని మాంసానికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. ఈ ప్రయోజనం వెనుక విటమిన్ B12 పాత్ర ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మాంసంలో ఈ విటమిన్ మంచి మొత్తంలో లభిస్తుంది. ఇది మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తికి చాలా అవసరం. B12 లోపం ఉంటే.. జ్ఞాపకశక్తి బలహీనపడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, మానసిక సమస్యలు కూడా వస్తాయి.

మెదడు ఆరోగ్యం కోసం

అయితే ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలో ఉందని, దీనిని తుది నిర్ధారణగా పరిగణించలేమని శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారు. జీవనశైలి, ఆర్థిక స్థితి, ఇతర అలవాట్లు కూడా దీనిపై ప్రభావం చూపుతాయని కొంతమంది నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ సరైన ఆహారం, చురుకైన జీవనశైలి, మానసికంగా చురుకుగా ఉండటం వల్ల మెదడును ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని చెప్తున్నారు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget