అన్వేషించండి

Running After 40 : 40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్

Exercise after 40 : 40 ఏళ్లు దాటాక రన్నింగ్ ప్రారంభించాలనుకుంటున్నారా? గాయాల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి, ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 40 ఏళ్ల తర్వాత పరుగు ఆరోగ్యానికి, గుండె పనితీరుకు మేలు.
  • వైద్య సలహా తీసుకుని, నడకతో పరుగు నెమ్మదిగా ప్రారంభించండి.
  • కండర బలానికి వ్యాయామాలు, తగిన నిద్ర, విశ్రాంతి ముఖ్యం.
  • తీవ్ర నొప్పిని విస్మరించవద్దు, సామర్థ్యానికి తగినట్లు పరుగెత్తాలి.

Running Tips For Beginners Over 40 : ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా సెలబ్రిటీలు రన్నింగ్ చేయడం, మారథాన్లలో పాల్గొనడం చూసి తాము కూడా పరుగెత్తాలని ఆసక్తి చూపిస్తుంటారు. అయితే 40 ఏళ్లు దాటిన తర్వాత రన్నింగ్ ప్రారంభించడం మంచిదేనా? ఒక్కసారిగా ఎక్కువ దూరం పరుగెత్తితే ఏమవుతుంది? ఈ వయసులో రన్నింగ్ మొదలుపెట్టేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

హైదరాబాద్​లోని యశోదా హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్​గా చేస్తోన్న డాక్టర్ అభిషేక్ బార్లీ  ఈ అంశంపై పలు సూచనలు చేశారు. లేట్ వయసులో రన్నింగ్ ప్రారంభించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

Also Read : HYROX ఫిట్‌నెస్ రేస్ ట్రెండింగ్.. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చా? డాక్టర్ సూచనలు ఇవే

40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయడం మంచిదేనా?

ఆరోగ్యంగా ఉన్నవారు 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా రన్నింగ్ చేయవచ్చని డాక్టర్ అభిషేక్ తెలిపారు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును నియంత్రించడానికి, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడటానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అన్నారు. అయితే ఈ వయసులో రన్నింగ్ ప్రారంభించాలనుకుంటే శరీర సామర్థ్యాన్ని గుర్తించడం చాలా ముఖ్యమని అంటున్నారు. 

" వయసు పెరిగే కొద్దీ కండరాల ద్రవ్యరాశి క్రమంగా తగ్గవచ్చు. స్నాయువులు, లిగమెంట్లలో వశ్యత తగ్గి, వ్యాయామ ఒత్తిడికి అలవాటు పడటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తు శిక్షణ లేకుండా ఒక్కసారిగా ఎక్కువ దూరం పరుగెత్తడం వల్ల గాయాల ప్రమాదం పెరుగుతుంది. "
-డాక్టర్ అభిషేక్

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చాలా కాలంగా వ్యాయామం చేయని వారు రన్నింగ్ ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, కీళ్ల సమస్యలు లేదా గతంలో గాయాలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. రన్నింగ్ చేస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వ్యాయామం వైద్య సహాయం తీసుకోవాలి.

Also Read : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి

నడకతో మొదలుపెట్టండి

మునుపెన్నడూ వ్యాయామం చేయని వారు మొదటి రోజే పరుగెత్తడానికి ప్రయత్నించకూడదు. ముందుగా నడకతో శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. కొంత దూరం వేగంగా నడవగలిగే సామర్థ్యం పెరిగిన తర్వాత స్మాల్ రన్నింగ్ సెషన్లను చేయవచ్చు. దీనివల్ల కండరాలు, కీళ్లు క్రమంగా వ్యాయామానికి అలవాటు పడతాయి.

ప్రారంభంలో కొన్ని నిమిషాలు నడిచి.. ఆ తర్వాత 30 నుంచి 60 సెకన్ల పాటు నెమ్మదిగా పరుగెత్తి మళ్లీ కొన్ని నిమిషాలు నడవవచ్చు. ఇలా మీ శరీర సామర్థ్యానికి తగ్గట్టుగా చేయాలి. మొదట వారానికి మూడు రోజులు, మధ్యలో విశ్రాంతి రోజులు ఉండేలా చూసుకోవచ్చు. మరీ ఆయాసం వచ్చేలా పరుగెత్తకూడదు.

Also Read : 30 తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే.. డైట్‌లో తప్పక ఉండాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే

కండరాల బలానికి వ్యాయామాలు చేయండి

రన్నింగ్ చేయాలంటే కేవలం కాళ్ల బలం ఉంటే సరిపోదు. కండరాలు, కీళ్లకు మద్దతు ఇచ్చే వ్యాయామాలు కూడా అవసరం. వారానికి రెండు రోజులు స్క్వాట్స్, లంజెస్, కాఫ్ రైజెస్, గ్లూట్ బ్రిడ్జెస్ వంటి స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు చేయవచ్చు. ఇవి కండరాల బలాన్ని పెంచడానికి, కీళ్ల స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అయితే మీకు ఇప్పటికే కీళ్ల నొప్పులు ఉంటే నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చేయడం మంచిది.

నిద్ర, ఆహారం, రెస్ట్

రన్నింగ్ ప్రారంభించిన తర్వాత శరీరానికి కోలుకునే సమయం ఇవ్వాలి. తగినంత నిద్రపోవడం, నీళ్లు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ తెలిపారు. కండరాల మరమ్మతు, పునరుద్ధరణకు ప్రోటీన్ అవసరం. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్ డి కూడా కీలకం. వ్యాయామం చేసిన రోజుల్లోనే ఎక్కువ దూరం పరుగెత్తాలని ప్రయత్నించకుండా.. శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వాలి.

Also Read : 90 శాతం మహిళల్లో విటమిన్ డి లోపం ఉందట.. ఎముకల నొప్పి, అలసట, మూడ్ స్వింగ్స్​కు ఇదే కారణమట

నొప్పి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు

వ్యాయామం చేసిన తర్వాత స్వల్పంగా కండరాల నొప్పి రావడం సాధారణమే. కానీ తీవ్రమైన నొప్పి, పెరుగుతున్న నొప్పి, వాపు, మడమ నొప్పి తగ్గకుండా ఉండటం లేదా ఎముకలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో నొప్పి రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటివి కనిపిస్తే రన్నింగ్ ఆపి వైద్యులను సంప్రదించాలి. 

మీ సామర్థ్యాన్ని గుర్తించండి..

సెలబ్రిటీలు మారథాన్లు పూర్తి చేయడం లేదా ఎక్కువ దూరం పరుగెత్తడం చూసి వెంటనే అలాంటి లక్ష్యాలను పెట్టుకోవడం సరికాదు. వారి శిక్షణ, శారీరక సామర్థ్యం, కోలుకునే సమయం మీకు భిన్నంగా ఉండవచ్చు. అందుకే వేగం, దూరం కంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంపై దృష్టి పెట్టాలి. కొన్ని నెలల పాటు క్రమంగా సాధన చేసిన తర్వాతే మీ సామర్థ్యానికి తగ్గట్టు లక్ష్యాలను పెంచుకోవాలి.

Also Read : ఎత్తు తగ్గడానికి కారణాలు ఇవే.. ఎవరి Height అకస్మాత్తుగా తగ్గుతుందో తెలుసా?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spicy Egg Masala Curry : ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
HYROX Fitness Race : HYROX ఫిట్‌నెస్ రేస్ ట్రెండింగ్.. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చా? డాక్టర్ సూచనలు ఇవే
HYROX ఫిట్‌నెస్ రేస్ ట్రెండింగ్.. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చా? డాక్టర్ సూచనలు ఇవే
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Castor Oil for Hair : జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి
జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Embed widget