అన్వేషించండి

Foods for Bone Health : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి

Bone Health Tips : బోన్స్ స్ట్రాంగ్గా లేకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. త్వరగా గాయాలు అవుతాయి. అందుకే కొన్ని ఫుడ్స్ జోలికి వెళ్లకూడదని చెప్తున్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పాలు, ఆకుకూరలు, నట్స్, చేపలు ఎముకలకు మేలు చేస్తాయి.

Avoid These Foods For Bones Health : శరీరానికి బలం ఇవ్వడంలో ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వయసు పెరిగే కొద్దీ.. కొన్ని ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కాల్షియం మాత్రలు తీసుకుంటే సరిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ కొన్ని ఆహారాలు శరీరంలో కాల్షియం శోషణను తగ్గించి ఎముకలను మరింత బలహీనపరుస్తాయి. అందుకే ఎముకల ఆరోగ్యానికి హాని చేసే ఫుడ్స్​తో పాటు.. ఏ ఫుడ్స్ తింటే మంచిదో కూడా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. 

తినకూడని ఫుడ్స్ లిస్ట్

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా తిన్నప్పుడు మూత్రం ద్వారా ఎక్కువ కాల్షియాన్ని బయటకు పోతుంది. దీంతో ఎముకల సాంద్రత క్రమంగా తగ్గే ప్రమాదం ఉంటుంది. చిప్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ తినడం మంచిది కాదు. అలాగే ప్రాసెస్ చేసిన మాంసంలో సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియం నష్టాన్ని పెంచుతాయి. 

సాఫ్ట్ డ్రింక్స్

డార్క్ సోడాలు, కోల్డ్ డ్రింక్స్‌లో ఫాస్ఫరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే ఇవి పోషకాలు లేకుండా కేలరీలను మాత్రమే అందిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు. నీరు, మజ్జిగ, తాజా ఫ్రూట్ జ్యూస్ వంటి వాటిని ఎంచుకోవడం మంచిది.

కాఫీ, టీ

రోజులో ఎక్కువ కాఫీ లేదా టీ తాగడం వల్ల కాల్షియం శోషణ తగ్గుతుంది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా కలిపిన కాఫీ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరంగా చెప్తున్నారు. అందుకే వీటిని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

స్వీట్స్, షుగర్స్

స్వీట్స్, బేకరీ ఐటమ్స్, కేకులు, పేస్ట్రీలు, షుగర్ డ్రింక్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచి ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాల సమతుల్యత కూడా తగ్గుతుంది.

ఎముకలకు మేలు చేసే ఆహారాలు 

పాలు, పెరుగు, పనీర్ వంటి వాటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను స్ట్రాంగ్​గా ఉంచడంలో సహాయం చేస్తాయి. పాలకూర, గోంగూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె ఉంటాయి. ఇవి ఎముకల బలానికి హెల్ప్ చేస్తాయి. నువ్వులు, బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌లో కాల్షియం, హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి. 

కాల్షియం మాత్రమే కాదు..

ఇవే కాకుండా సాల్మన్, సార్డిన్ వంటి చేపల్లో విటమిన్ D, కాల్షియం ఉంటాయి. విటమిన్ D లేకపోతే శరీరం కాల్షియంను సరిగా గ్రహించలేదని గుర్తించకోవాలి. కేవలం కాల్షియం మాత్రమే కాదు.. సరైన ప్రోటీన్, విటమిన్ D, రెగ్యులర్ వ్యాయామం కూడా ఎముకల ఆరోగ్యానికి అవసరం. నడక, వెయిట్ బేరింగ్ ఎక్సర్‌సైజులు, సూర్యరశ్మి కూడా ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget