విటమిన్ డి తగ్గిందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి

Published by: Geddam Vijaya Madhuri

తీవ్రమైన విటమిన్ D లోపం ఉంటే అలసట, ఎముకల నొప్పులు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించొచ్చు.

విటమిన్ D కోసం కేవలం ఎండలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని ఫుడ్స్ ద్వారా కూడా శరీరానికి అవసరమైన విటమిన్ D పొందొచ్చు.

సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి ఫ్యాటీ ఫిష్‌లలో విటమిన్ D అధికంగా ఉంటుంది. వీటిని వారానికి 2 సార్లు తీసుకుంటే మంచిది.

గుడ్డు పచ్చసొనలో కూడా విటమిన్ D ఉంటుంది. రోజూ పరిమిత మోతాదులో గుడ్లు తినడం ఉపయోగకరం.

పాలు, పెరుగు, బ్రేక్‌ఫాస్ట్ సెరెల్స్ వంటి వాటిలో అదనంగా విటమిన్ D కలుపుతారు. వీటిని డైట్‌లో చేర్చుకోవచ్చు.

వైద్యుల సూచన మేరకు తీసుకుంటే విటమిన్ D సప్లిమెంట్స్ తీసుకుంటే లోపాన్ని తగ్గించుకోవచ్చు.

మష్రూమ్స్ ముఖ్యంగా సూర్యరశ్మిలో పెరిగిన వాటిలో విటమిన్ D కొంతమేర లభిస్తుంది. వెజిటేరియన్స్‌కు ఇవి మంచి ఆప్షన్.

ఇంట్లో కిటికీ దగ్గర కూర్చోవడం వల్ల కొంత సూర్యకాంతి శరీరానికి అందొచ్చు. అయితే గ్లాస్ పూర్తిగా UVB కిరణాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది.

విటమిన్ D శరీరంలో సరిగా పని చేయాలంటే కాల్షియం, మెగ్నీషియం ఉన్న ఆహారం కూడా అవసరం. పాలు, నట్స్, ఆకుకూరలు తీసుకోవచ్చు.

ఊబకాయం, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలు కూడా విటమిన్ D స్థాయులను ప్రభావితం చేస్తాయి.