ప్రీ-డయాబెటిస్ సంకేతాలు ఇవే.. ముందుగా గుర్తిస్తే షుగర్‌ను అడ్డుకోవచ్చు

Published by: Geddam Vijaya Madhuri

నోరు తరచుగా ఎండిపోవడం, నీళ్లు తాగాలనిపించడం ప్రీ-డయాబెటిస్​కు సంకేతం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఇలా జరుగుతుంది.

ముఖ్యంగా రాత్రిపూట పలుమార్లు యూరిన్‌కు వెళ్లాల్సి వస్తే జాగ్రత్త పడాలి. ఇది అధిక గ్లూకోజ్ కారణంగా ఉండొచ్చు.

తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేయడం కూడా ఒక హెచ్చరిక సంకేతం. శరీరం గ్లూకోజ్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోతే ఇలా జరుగుతుంది.

చిన్న పని చేసినా అలసటగా అనిపించడం, శరీరంలో శక్తి లేకపోవడం ప్రీ-డయాబెటిస్ లక్షణాల్లో ఒకటి.

ప్రత్యేకంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు సంకేతం కావచ్చు. కొందరిలో అకస్మాత్తుగా బరువు తగ్గడమూ కనిపిస్తుంది.

మెడ వెనుక భాగం, మోకాల్ల దగ్గర చర్మం నల్లగా మారితే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు సంకేతం కావచ్చు.

చిన్న గాయాలు కూడా త్వరగా మానకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావం చూపుతున్నాయేమో పరీక్షించుకోవాలి.

కొన్ని సందర్భాల్లో రక్తంలో షుగర్ స్థాయిల మార్పుల వల్ల చూపు తాత్కాలికంగా బ్లర్‌గా కనిపించవచ్చు.

నరాలపై ప్రభావం పడటం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిరి, మంట, సూదులతో గుచ్చినట్లు అనిపించవచ్చు.

ఎప్పుడూ తీపి తినాలనిపించడం, కార్బోహైడ్రేట్స్‌పై ఎక్కువ ఆసక్తి ఉండటం కూడా రక్తంలో చక్కెర అసమతుల్యతకు సంకేతం కావచ్చు.