మగవారు ఆడవారికంటే త్వరగా నిద్రపోవడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

పురుషుల మెదడు ఒకేసారి తక్కువ విషయాలపై ఫోకస్ చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మహిళలు అయితే ఒకేసారి అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల వారికి నిద్ర రావడం ఆలస్యం కావచ్చు.

మహిళల్లో ఆందోళన, ఒత్తిడి, భావోద్వేగ స్పందనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవి మెదడును యాక్టివ్‌గా ఉంచి నిద్రను ఆలస్యం చేస్తాయి.

మహిళల్లో పీరియడ్స్, గర్భధారణ, మెనోపాజ్ వంటి దశల్లో హార్మోన్ల మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ఇవి నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతాయి.

మగవారు ఎక్కువ ఫిజికల్ వర్క్ చేసినప్పుడు త్వరగా డీప్ స్లీప్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. శరీర అలసట నిద్రను వేగంగా తెస్తుంది.

నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ విడుదలలో తేడాలు ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

పిల్లల సంరక్షణ, ఇంటి పనులు, మానసిక బాధ్యతల వల్ల మహిళలకు మధ్యలో నిద్ర భంగం ఎక్కువగా ఉండొచ్చు.

రాత్రివేళ ఫోన్లు, సోషల్ మీడియా, సీరియల్స్ ఎక్కువగా చూడటం వల్ల మెదడు అలర్ట్‌గా ఉండి నిద్ర ఆలస్యం అవుతుంది.

ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

ఇన్సోమ్నియా వంటి నిద్ర సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీనివల్ల నిద్రపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ప్రతి పురుషుడు వెంటనే నిద్రపోతాడు.. ప్రతి మహిళ ఆలస్యంగా నిద్రపోతుంది అనుకోవడం తప్పు.

ఇవి నిద్ర అలవాట్లు వ్యక్తిగత ఆరోగ్యం, జీవనశైలి, మానసిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.