ఉదయాన్నే దానిమ్మ తినడం మంచిదేనా?

Published by: Geddam Vijaya Madhuri

పరగడుపున దానిమ్మ తింటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C, ఫైబర్ వంటి పోషకాలు అందుతాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచుతాయి.

దానిమ్మలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం తగ్గే అవకాశం ఉంటుంది.

ఉదయాన్నే దానిమ్మ తింటే శరీరానికి సహజమైన ఎనర్జీ లభిస్తుంది. అలసట తగ్గవచ్చు.

శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పరగడుపున తింటే కొందరికి ఎసిడిటీ లేదా కడుపులో అసౌకర్యం కలగొచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తినకపోవడమే బెటర్.

దానిమ్మలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి.

ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ ఎక్కువగా తాగితే షుగర్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి.

శరీరంలో నీటి శాతం, హైడ్రేషన్ మెరుగుపడటానికి సహాయపడొచ్చు. వేసవిలో తింటే మంచిది.

బీపీ మందులు లేదా ఇతర మందులు వాడేవారు దానిమ్మను రెగ్యులర్‌గా తీసుకోవాలనుకుంటే వైద్యుల సలహా తీసుకోవాలి.

ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ లేదా డైటీషియన్ సూచనలు పాటిస్తే మంచిది.

Published by: Geddam Vijaya Madhuri