కిడ్నీ స్టోన్స్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్లే

Published by: Geddam Vijaya Madhuri

నీళ్లు తక్కువగా తాగే వారికి డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ స్టోన్స్ ప్రమాదం పెరుగుతుంది.

ఎక్కువ ఉప్పు తినేవారికి కూడా ఈ ప్రమాదం ఉంది. అధిక ఉప్పు కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది.

ఎండలో ఎక్కువగా పనిచేసేవారికి.. చెమట ఎక్కువగా రావడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది.

స్టోన్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి రిస్క్ పెరగవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

ఊబకాయం, అధిక బరువు ఉన్నవారికి కిడ్నీ స్టోన్స్ అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగేవారికి కూడా రిస్క్ ఎక్కువే. షుగర్, సోడా డ్రింక్స్ అధికంగా తీసుకోవడం మంచిది కాదు.

ఆక్సలేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినకూడదు. పాలకూర, బీట్‌రూట్, నట్స్ వంటివి అధికంగా తీసుకుంటే ప్రమాదం పెరగొచ్చు.

మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం కూడా మంచిది కాదు. యూరిన్ ఆపడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు రావచ్చు.

డయాబెటిస్ లేదా హై బీపీ ఉన్నవారికి కూడా కిడ్నీలపై నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ప్రోటీన్ సప్లిమెంట్స్ అధికంగా తీసుకునేవారికి స్టోన్స్‌ వచ్చే అవకాశం ఉంది.