మగవారు యాలకులు తింటే కలిగే లాభాలు.. రోజుకి ఎంత తినాలి?

Published by: Geddam Vijaya Madhuri

యాలకుల్లో ఉండే సహజ గుణాలు గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గేందుకు ఉపయోగపడతాయి.

సహజ మౌత్ ఫ్రెష్‌నర్‌లా పనిచేస్తాయి. నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా, దుర్వాసన తగ్గిస్తాయి.

యాలకులు రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడొచ్చు. దీంతో అలసట తగ్గుతుంది.

యాలకుల వాసన మనసుకు రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది.

యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కొన్ని అధ్యయనాల ప్రకారం యాలకులు రక్తపోటును నియంత్రించడంలో కొంత వరకు హెల్ప్ చేస్తాయి.

కఫం తగ్గించడంలో సహాయపడొచ్చు. జలుబు, ముక్కు బ్లాక్ వంటి సమస్యల్లో కొంత ఉపశమనం కలిగించవచ్చు.

యాలకులు మెటాబాలిజాన్ని కొంత వరకు యాక్టివ్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఇది బరువు తగ్గేందుకు పనిచేస్తుంది.

యాలకులను శరీర బలం, స్టామినా పెంచే మసాలాగా ఉపయోగిస్తుంటారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాలి.

రోజుకు 1–2 యాలకులు తీసుకుంటే చాలు. ఎక్కువగా తీసుకుంటే కొందరికి అలర్జీ, కడుపు అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చు.

వైద్యుల సూచనల మేరకు వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.