మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా? మంచిదా? కాదా?

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో మజ్జిగ తాగితే శరీర ఉష్ణోగ్రత కొంత వరకు నియంత్రణలో ఉంటుంది. డీహైడ్రేషన్ తగ్గుతుంది.

అందుకే దీనిని ఎక్కువమంది.. చాలా ఎక్కువగా తాగుతారు. కానీ ఇలా ఎక్కువగా తాగితే జీర్ణ సమస్యలు రావచ్చు.

అవసరానికి మించి మజ్జిగ తాగితే కొందరికి కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.

మజ్జిగలో ఎక్కువ ఉప్పు వేసుకుని తాగితే.. హై బీపీ ఉన్నవారికి మంచిది కాదు.

రాత్రివేళల్లో మజ్జిగ ఎక్కువగా తాగితే కొందరికి జలుబు, గొంతులో కఫం వంటి సమస్యలు రావచ్చు.

మిల్క్, మిల్క్ ప్రొడెక్ట్స్ కూడా అసౌకర్యం కలగొచ్చు. విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు పెంచుతాయి.

ఫ్రిజ్ నుంచి తీసిన మజ్జిగలో ఎక్కువ ఐస్ వేసుకుని తాగితే గొంతు నొప్పి లేదా జీర్ణ సమస్యలు రావచ్చు.

రోడ్ల పక్కన లేదా పరిశుభ్రత లేని చోట దొరికే మజ్జిగ తాగితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే జీర్ణక్రియకు మంచిది. కానీ రోజంతా లీటర్ల కొద్దీ తాగకూడదు.

కిడ్నీ సమస్యలు, హై బీపీ, జీర్ణ సమస్యలు ఉన్నవారు మజ్జిగను వైద్యుల సూచనల మేరకు తీసుకుంటే మంచిది.

మజ్జిగలో జీలకర్ర పొడి, అల్లం, కరివేపాకు వంటి పదార్థాలు కలిపితే జీర్ణక్రియకు మంచిది.