ప్రతిరోజూ అల్లం ముక్క నమిలితే 60 రోజులు తర్వాత జరిగే మార్పులివే

Published by: Geddam Vijaya Madhuri

అల్లం జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కొంత తగ్గొచ్చు.

ట్రావెల్ సిక్నెస్ లేదా ఉదయం వికారం ఉన్నవారు తింటే అల్లం కొంత మంచి ఫలితాలు ఉంటాయి.

అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతు ఇర్రిటేషన్ తగ్గించడంలో సహాయపడవచ్చు.

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో ఇమ్యూనిటీకి కొంత ప్రయోజనం ఉండొచ్చు.

కొన్ని పరిశోధనలు అల్లం కీళ్ల నొప్పులు, వాపు తగ్గించడంలో ఉపయోగపడొచ్చని సూచిస్తున్నాయి.

కొన్ని స్టడీస్ ప్రకారం అల్లం రక్తంలో చక్కెర స్థాయులపై ప్రభావం చూపొచ్చు. కానీ దీనిని మందుల స్థానంలో వాడకూడదు.

అల్లం లాలాజల ఉత్పత్తిని పెంచి నోటిని తాజాగా ఉంచడంలో సహాయపడొచ్చు.

రోజూ ఎక్కువ అల్లం తింటే కొందరిలో కడుపు మంట, యాసిడిటీ, విరేచనాలు రావచ్చు.

అల్లం రక్తం పలుచబడే ప్రభావం చూపొచ్చు. కాబట్టి బీపీ మందులు వాడేవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

60 రోజులు అల్లం నమిలినా.. డైట్ మంచిగా లేకుండా, నిద్ర లేకుండా, వ్యాయామం చేయకుండా ఉంటే పెద్ద మార్పులు రావు.

హెల్తీ లైఫ్‌స్టైల్‌తో అల్లాన్ని తీసుకుంటేనే మంచి ప్రయోజనం ఉంటుంది.