బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఇవే.. లైట్ తీసుకోకండి

Published by: Geddam Vijaya Madhuri

సాధారణ తలనొప్పిలా కాకుండా తరచుగా, ముఖ్యంగా ఉదయం ఎక్కువగా తలనొప్పి రావచ్చు.

ఎలాంటి కడుపు సమస్య లేకపోయినా తరచుగా వాంతులు రావడం ఒక సంకేతం కావచ్చు.

డబుల్ విజన్, మసకగా కనిపించడం లేదా ఒక్కసారిగా చూపు తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.

సరిగ్గా మాట్లాడలేకపోవడం లేదా మాటలు గుర్తుకు రాకపోవడం వంటి సమస్యలు కనిపించొచ్చు.

శరీరంలోని ఒక వైపు బలహీనంగా అనిపించడం లేదా నడవడంలో ఇబ్బంది రావచ్చు.

ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా సీజ్‌ర్స్ లేదా ఫిట్స్ రావడం హెచ్చరిక సంకేతం కావచ్చు.

చిన్న విషయాలు మర్చిపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి మార్పులు కనిపించొచ్చు.

చెవిలో శబ్దాలు వినిపించడం లేదా వినికిడి తగ్గడం కొన్ని సందర్భాల్లో కనిపించొచ్చు.

ఎప్పుడూ అలసటగా ఉండటం, ఎక్కువగా నిద్ర రావడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

తలనొప్పి వచ్చింది అంటే ప్రతిసారి బ్రెయిన్ ట్యూమర్ అని కాదు. కానీ ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.