చెమట వల్ల శరీరం నుంచి దుర్వాసన వస్తుందా? ఇలా దూరం చేసుకోండి

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. ఇది బ్యాక్టీరియాతో కలిసినప్పుడు దుర్వాసన వస్తుంది.

ఇలాంటి సమయంలో రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది. ఇది బాడీ స్మెల్ తగ్గిస్తుంది.

చెమట పట్టిన బట్టలు ఎక్కువసేపు వేసుకుంటే బ్యాక్టీరియా పెరిగి వాసన పెరుగుతుంది. కాటన్ బట్టలు వేసుకోవడం బెటర్.

శరీరంలో నీరు తగ్గితే టాక్సిన్లు బయటకు సరిగా వెళ్లవు. దీంతో శరీరం నుంచి వాసన ఎక్కువగా రావచ్చు. రోజుకు సరిపడా నీళ్లు తాగాలి.

వెల్లుల్లి, ఉల్లి, స్పైసీ ఫుడ్స్ చెమట ద్వారా బలమైన వాసనకు కారణమవుతాయి. కాబట్టి వీటిని మితంగా తీసుకోవాలి.

చంకల దగ్గర హెయిర్ ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా, చెమట త్వరగా పెరుగుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.

నిమ్మలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందుకే చంకల దగ్గర కొద్దిగా నిమ్మరసం రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బేకింగ్ సోడా కొద్దిగా నీళ్లలో కలిపి చంకల దగ్గర రాస్తే చెమట తడి తగ్గి వాసన తగ్గే అవకాశం ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ ఉంటే జాగ్రత్త.

గట్ హెల్త్ బాగోలేకపోయినా శరీర వాసన పెరగొచ్చు. కాబట్టి ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి.

పాదాల నుంచి వచ్చే దుర్వాసన కూడా సాధారణ సమస్యే. రోజూ సాక్స్ మార్చడం, షూస్ ఎండలో పెట్టడం మంచిది.

డయాబెటిస్, థైరాయిడ్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నా శరీర వాసన ఎక్కువగా రావచ్చు. సాధారణ చిట్కాలతో తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.