2 వారాలు ప్రతిరోజూ గుడ్లు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. ఆకలి త్వరగా వేయదు.

ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల కండరాల బలం మెరుగుపడుతుంది. వ్యాయామం చేసే వారికి ఇవి మరింత మంచివి.

గుడ్లలో ఉండే విటమిన్ B12, కొలిన్ మెదడు పనితీరును మెరుగుపరిచి.. ఏకాగ్రత పెంచుతాయి.

కళ్ల ఆరోగ్యానికి గుడ్లు మంచివి. ఇందులో ఉండే ల్యూటిన్, జియాజాంటిన్ వంటి పోషకాలు కంటి సమస్యలను తగ్గిస్తాయి.

గుడ్లు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరగొచ్చు. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు తక్కువగా తీసుకోవాలి.

గుడ్లలో బయోటిన్ ఉండటం వల్ల జుట్టు, గోర్లు బలంగా మారేందుకు సహాయపడుతుంది.

ఉదయాన్నే గుడ్లు తింటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గొచ్చు.

గుడ్లలో ఉండే విటమిన్ D ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కాల్షియం శరీరానికి సరిగా అందేందుకు సహాయపడుతుంది.

ఎక్కువగా ఆయిల్‌లో ఫ్రై చేసిన గుడ్లు తింటే బరువు పెరగడం, ఫ్యాట్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు.

కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు లేదా హై కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతిరోజూ గుడ్లు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.