మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే.. కిడ్నీల సమస్య ఉంటే తినకూడదా?

Published by: Geddam Vijaya Madhuri

బాదం, జీడిపప్పు, వేరుశెనగ వంటి నట్స్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి.

పాలకూర, గోంగూర, బచ్చలి వంటి ఆకుకూరల్లో కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని మినరల్స్ బ్యాలెన్స్ చేస్తాయి.

గుమ్మడికాయ గింజలు మెగ్నీషియానికి మంచి సోర్స్. ఇవి కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అరటిపండ్లు, అవకాడో వంటి పండ్లలోని మెగ్నీషియం శరీరానికి ఎనర్జీని అందిస్తుంది.

ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటి హోల్ గ్రెయిన్స్ తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పెసర్లు, శనగలు, రాజ్మా వంటి పప్పుధాన్యాలు తింటే మెగ్నీషియంతో పాటు ప్రోటీన్ కూడా అందుతుంది.

డార్క్ చాక్లెట్‌లో కూడా మెగ్నీషియం ఉంటుంది. పరిమితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

మెగ్నీషియం శరీరంలో కండరాల పనితీరును మెరుగుపరచి.. కాళ్ల నొప్పులు, కండరాల పట్టేసే సమస్యలను తగ్గిస్తుంది.

సరిపడా మెగ్నీషియం తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.

కిడ్నీ సమస్యలు ఇప్పటికే ఉన్నవారు మెగ్నీషియం ఎక్కువగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.