నిద్రలో నోటి నుంచి లాలాజలం(చొంగ) కారడానికి కారణాలు, నివారణ చిట్కాలు

Published by: Geddam Vijaya Madhuri

నిద్రపోయే సమయంలో పక్కకు తిరిగి పడుకోవడం వల్ల లాలాజలం బయటకు కారే అవకాశం ఉంటుంది.

ముక్కు బ్లాక్ అయ్యి నోటి ద్వారా శ్వాస తీసుకుంటే ఈ సమస్య ఎక్కువగా కనిపించొచ్చు.

జలుబు, సైనసైటిస్, అలర్జీ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా నిద్రలో నోరు తెరుచుకుని లాలాజలం కారవచ్చు.

కొందరిలో ఎక్కువ లాలాజలం ఉత్పత్తి కావడం కూడా కారణంగా ఉంటుంది. ముఖ్యంగా మసాలా ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఇలా జరగొచ్చు.

ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు.

కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా నోరులో లాలాజలం ఎక్కువగా తయారవుతుంది.

పడుకునే ముందు ముక్కు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం వల్ల సమస్య కొంత తగ్గవచ్చు.

ఎప్పుడూ వెనక్కి కాకుండా కొంచెం ఎత్తైన దిండుతో పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

నిద్రలో గురక ఎక్కువగా ఉంటే లేదా శ్వాసలో ఇబ్బంది ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

తరచూ లాలాజలం కారడం, మాట్లాడటంలో ఇబ్బంది, ముఖ కండరాల బలహీనత వంటి లక్షణాలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి.