ఒక్క రాత్రి సరిగా నిద్రపోకపోతే శరీరంలో జరిగే మార్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

ఒక్క రాత్రి తక్కువ నిద్రపోయినా శరీరానికి సరైన విశ్రాంతి దక్కదు. దీంతో మరుసటి రోజు నీరసం, బలహీనంగా అనిపించొచ్చు.

సరిగా నిద్ర లేకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది. పని, చదువుపై ఫోకస్ పెట్టడం కష్టమవుతుంది.

చిన్న విషయానికే కోపం రావడం, చిరాకు పెరగడం, టెన్షన్‌గా అనిపించడం వంటి మార్పులు కనిపించొచ్చు.

తక్కువ నిద్ర వల్ల కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్, ఉబ్బరం ఎక్కువగా కనిపించొచ్చు.

నిద్ర తక్కువైతే ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితమవుతాయి. దీంతో జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరిగే అవకాశం ఉంటుంది.

స్లీప్ డిస్టర్బ్ అయితే కొందరికి తలనొప్పి లేదా తల బరువుగా అనిపించొచ్చు.

రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. శరీరం అలసటకు గురై ఇమ్యూనిటీ తాత్కాలికంగా బలహీనపడొచ్చు.

సరిగా నిద్రపోకపోతే ముఖం ఫ్రెష్‌నెస్ కోల్పోయి చర్మం నిర్జీవంగా కనిపించొచ్చు.

డ్రైవింగ్ లేదా ఇతర పనులు చేస్తూ వెంటనే స్పందించాల్సిన సందర్భాల్లో శరీరం స్లోగా రియాక్ట్ అవుతుంది.

తరచూ నిద్ర తగ్గితే బీపీ, స్ట్రెస్ హార్మోన్లు పెరిగి గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.