మీగడ, పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖానికి ఎంత మంచిదో

Published by: Geddam Vijaya Madhuri

పాల మీగడలో ఉండే పోషకాలు, పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నేచురల్‌గా గ్లో అయ్యేలా చేస్తాయి.

పాల మీగడ చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీంతో పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది.

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, చర్మంపై వచ్చే ఇన్‌ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది.

ఎండలో తిరగడం వల్ల వచ్చిన టాన్‌ను తగ్గించి స్కిన్ టోన్‌ను మెరుగుపరచడంలో ఈ ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది.

రెగ్యులర్‌గా వాడితే చర్మం సాఫ్ట్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ముడతలు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ ఏజింగ్‌ను నెమ్మదింపజేయడంతో పాటు డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తాయి.

ఎండాకాలంలో ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. దీంతో స్కిన్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

మొటిమల మచ్చలు, చిన్న చిన్న డార్క్ స్పాట్స్ తగ్గేందుకు ఈ ప్యాక్ ఉపయోగపడొచ్చు.

కేవలం పాల మీగడ, చిటికెడు పసుపుతో ఈ ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది.

ట్రై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మంచిది.