డిజిటల్ డీటాక్స్ టిప్స్.. ఫోన్​ ఎక్కువగా చూసేవారికోసమే

Published by: Geddam Vijaya Madhuri

ఈరోజుల్లో ఫోన్, స్క్రీన్స్ చూడడం అనేవి ఓ వ్యసనంగా మారిపోయాయి. ఈ సమయంలో డిజిటల్ డీటాక్స్ చాలా అవసరంగా అయిపోయింది.

అందుకే ఈ చెర నుంచి బయటపడేందుకు కొన్ని టిప్స్ రెగ్యులర్​గా ఫాలో అయితే మంచిది.

లేవగానే మొబైల్ చూడడం ఒత్తిడిని పెంచుతుంది. కొంతసేపు ప్రశాంతంగా గడపడం మంచిది.

రోజంతా స్క్రోల్ చేస్తూ ఉండటం మానసిక అలసటకు దారితీస్తుంది. కాబట్టి సోషల్ మీడియా చూడడం తగ్గించండి.

నిద్రకు ముందు స్క్రీన్ దూరంగా పెట్టండి. పడుకునే ముందు స్క్రీన్ తగ్గిస్తే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

అవసరం లేని అలర్ట్స్ మనసును డిస్టర్బ్ చేస్తాయి. ముఖ్యమైన యాప్స్‌కే నోటిఫికేషన్లు ఉంచండి.

కనీసం రోజులో 30 నిమిషాలు గాడ్జెట్స్ లేకుండా గడపడం నేర్చుకోండి. ఇది మెదడుకు విశ్రాంతినిస్తుంది.

ప్రకృతిలో గడపండి. పార్క్‌లో నడక, మొక్కల మధ్య గడపడం మూడ్‌ను రిఫ్రెష్ చేస్తుంది.

ఫ్యామిలీతో ఫోన్‌లో కాకుండా నేరుగా మాట్లాడటం నేర్చుకోండి.

హాబీలకు సమయం కేటాయించండి. పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, సంగీతం వంటివి బెస్ట్.

స్క్రీన్ టైమ్ ట్రాక్ చేయండి. రోజుకు ఎంతసేపు ఫోన్ వాడుతున్నారో తెలుసుకుంటే మంచిది.

వీక్‌లో ఒక రోజు డిజిటల్ బ్రేక్ తీసుకోండి. సోషల్ మీడియా, గాడ్జెట్స్‌కి దూరంగా ఉంటే మంచిది.