ఇంట్లో బొద్దింకల(Cockroaches) బెడద ఎక్కువగా ఉందా? ఇలా దూరం చేసుకోండి

Published by: Geddam Vijaya Madhuri

బొద్దింకలు దూరం చేసుకోవాలనుకుంటే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఫుడ్ వల్ల బొద్దింకలు త్వరగా చేరుతాయి.

అలాగే రాత్రుళ్లు సింక్‌లో పాత్రలు పేరుకోకుండా వెంటనే కడగడం మంచిది.

ఆహార పదార్థాలను ఓపెన్‌గా ఉంచకుండా ఎయిర్‌టైట్ డబ్బాల్లో నిల్వ చేయాలి.

చెత్త బుట్టను ప్రతిరోజూ ఖాళీ చేసి మూతపెట్టి ఉంచాలి.

గోడల్లో, కిటికీల దగ్గర ఉన్న చిన్న రంధ్రాలను మూసేయాలి. ఇవే బొద్దింకలకు దాక్కునే ప్రదేశాలు.

ఇంట్లో తడి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. బొద్దింకలు తేమ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి.

బేకింగ్ సోడా, చక్కెర కలిపి మూలల్లో పెడితే బొద్దింకలను తగ్గించడంలో సహాయపడొచ్చు.

బే లీవ్స్ లేదా పుదీనా వాసన బొద్దింకలకు ఇష్టం ఉండదు. వీటిని కిచెన్ మూలల్లో పెట్టొచ్చు.

డ్రెయినేజ్ పైపులు, సింక్ ప్రాంతాలను తరచూ శుభ్రం చేయాలి.

సమస్య ఎక్కువగా ఉంటే ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోల్ సేవలు తీసుకోవడం మంచిది.