డయాబెటిస్ ఉన్నవారు నెయ్యి తినొచ్చా? రోజుకి ఎంత తీసుకోవచ్చంటే

Published by: Geddam Vijaya Madhuri

పరిమిత మోతాదులో నెయ్యి తీసుకుంటే డయాబెటిస్ ఉన్నవారికి సురక్షితమే అని నిపుణులు చెబుతున్నారు.

నెయ్యిలో మంచి కొవ్వులు ఉండటం వల్ల శరీరానికి శక్తి అందించడంలో సహాయపడుతుంది.

నెయ్యి ఆహారం జీర్ణం అయ్యే వేగాన్ని తగ్గించి.. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా హెల్ప్ చేస్తుంది.

వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని తరచుగా తింటే మాత్రం బరువు పెరగడానికి కారణమవుతుంది.

డయాబెటిస్ ఉన్నవారిలో గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నెయ్యి పరిమితంగా తీసుకోవాలి.

రోజుకు ఒకటి లేదా రెండు టీ స్పూన్లకు మించి నెయ్యి తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంట్లో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి మార్కెట్‌లో దొరికే ప్రాసెస్డ్ వెర్షన్ల కంటే మెరుగైన ఎంపికగా భావిస్తారు.

కూరలు, రోటీలు, మిల్లెట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలతో కొద్దిగా నెయ్యి తీసుకుంటే రుచి కూడా పెరుగుతుంది.

ఇప్పటికే కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి.

డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే నెయ్యి మాత్రమే కాదు.. మొత్తం డైట్, వ్యాయామం, జీవనశైలి కూడా చాలా ముఖ్యం.