శరీరానికి విటమిన్ B12 ఎందుకు అవసరం? ఇదేమి చేస్తుంది

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ B12 ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల తయారికి అవసరం. ఇది తక్కువైతే అనీమియా వచ్చే ప్రమాదం ఉంటుంది.

నర్వ్స్ సరిగ్గా పనిచేయడానికి B12 చాలా ముఖ్యం. ఇది నరాలను రక్షించే పొరను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఆహారాన్ని ఎనర్జీగా మార్చే ప్రక్రియలో ఈ విటమిన్ కీలకంగా పనిచేస్తుంది. B12 లోపం ఉంటే అలసట, నీరసం ఎక్కువగా అనిపించొచ్చు.

ఆహారాన్ని ఎనర్జీగా మార్చే ప్రక్రియలో ఈ విటమిన్ కీలకంగా పనిచేస్తుంది. B12 లోపం ఉంటే అలసట, నీరసం ఎక్కువగా అనిపించొచ్చు.

శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన DNA నిర్మాణంలో B12 ముఖ్య పాత్ర పోషిస్తుంది.

సెరటోనిన్ వంటి మూడ్‌కు సంబంధించిన కెమికల్స్ తయారీలో B12 సహాయపడుతుంది. లోపం ఉంటే చిరాకు, డిప్రెషన్ వంటి సమస్యలు రావచ్చు.

గర్భంలో శిశువు మెదడు, నర్వస్ సిస్టమ్ సరిగ్గా అభివృద్ధి చెందడానికి విటమిన్ B12 అవసరం.

హోమోసిస్టైన్ అనే పదార్థాన్ని నియంత్రించడంలో B12 సహాయపడుతుంది. దీంతో హార్ట్ సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.

B12 సరిపడా ఉంటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. లోపం ఉంటే జుట్టు రాలడం, చర్మం వెలిసిపోవడం కనిపించొచ్చు.

తీవ్ర అలసట, చేతులు కాళ్లు మొద్దుబారడం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలు B12 లోపానికి సంకేతాలు కావచ్చు.