వేసవిలో నేరేడు పండ్లు తింటే కలిగే లాభాలు.. డయాబెటిస్ ఉంటే తినొచ్చా?

Published by: Geddam Vijaya Madhuri

నేరేడు పండ్లు శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. అధిక వేడి, దాహం తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవచ్చు.

జీర్ణక్రియను మెరుగుపరచి.. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గేందుకు సహాయం చేస్తాయి.

డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. శరీరానికి తేమను అందిస్తాయి.

నేరేడు పండ్లలో విటమిన్ C, ఐరన్ పుష్కలంగా ఉండటంతో రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి కూడా మంచివి. మొటిమలు, ఆయిలీ స్కిన్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయి.

బరువు తగ్గాలని భావించే వారికి కూడా ఇవి మంచి ఎంపిక. తక్కువ క్యాలరీలు ఉండటంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా నేరేడు ఉపయోగపడుతుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.