వేసవిలో సొరకాయ తినట్లేదా? అయితే మీరు ఇవి మిస్ అవుతున్నట్లే

Published by: Geddam Vijaya Madhuri

సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది.

డీహైడ్రేషన్ సమస్యను తగ్గించి శరీరానికి తగిన తేమను అందిస్తుంది.

తేలికగా జీర్ణమవుతుంది. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

క్యాలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలని భావించే వారికి మంచిది.

సొరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

అధిక వేడి వల్ల వచ్చే అలసటను తగ్గించి శరీరానికి తేలికైన ఎనర్జీని అందిస్తుంది.

సొరకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కాలేయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. టాక్సిన్స్ బయటకు పంపుతుంది.

సొరకాయ జ్యూస్ పరిమితంగా తీసుకుంటే శరీర వేడి తగ్గుతుంది. అయితే చేదుగా ఉన్న సొరకాయను మాత్రం తినకూడదు.

డయాబెటిస్ ఉన్నవారికి కూడా సొరకాయ ఉపయోగకరంగా ఉండొచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది.