బ్రౌన్ రైస్, తెల్ల బియ్యానికి మధ్య వ్యత్యాసాలు ఇక్కడ తెలుసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు అన్నం తినడం వల్ల బరువు పెరుగుతామని, షుగర్ వస్తుందని భయపడుతున్నారా

Image Source: pexels

అయితే మీ ఆరోగ్యానికి బ్రౌన్ రైస్ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Image Source: pexels

బ్రౌన్ రైస్ బయటి పొట్టు మాత్రమే తొలగించిన ధాన్యపు బియ్యం. అయితే తెల్ల బియ్యాన్ని ప్రాసెస్ చేసి దానిపై పొరను బాగా తీసివేస్తారు.

Image Source: pexels

తెల్ల బియ్యాన్ని మిల్లులలో బాగా పాలిష్ చేస్తారు. దాంతో బియ్యంలోని చాలా పోషకాలు నశిస్తాయి.

Image Source: pexels

తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Image Source: pexels

తెల్ల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువ కాగా, బ్రౌన్ రైస్ GI తక్కువగా ఉంటుంది.

Image Source: pexels

బ్రౌన్ రైస్ తక్కువ GI కలిగి ఉండటం వల్ల మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి ఆరోగ్యానికి మంచిది.

Image Source: pexels

ఈ రెండింట్లోనూ కేలరీలు, కార్బోహైడ్రేట్ల దాదాపు సమానంగానే ఉంటాయి. కానీ పోషకాల పరంగా బ్రౌన్ రైస్ ముందుంటుంది.

Image Source: pexels

ఈ 2 రకాల బియ్యం (బ్రౌన్ రైస్, వైట్ రైస్) సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి

Image Source: pexels

తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పోషక విలువలు అధికం, జీర్ణవ్యవస్థకు సైతం మేలు చేస్తుంది.

Image Source: pexels