బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?

Published by: Geddam Vijaya Madhuri

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు రావచ్చు. కాబట్టి బ్రేక్​ఫాస్ట్ తర్వాత తాగితే మెటాబాలిజం పెరుగుతుంది.

వ్యాయామానికి 30–45 నిమిషాల ముందు తాగితే ఫ్యాట్ బర్నింగ్ పెరుగుతుంది.

గ్రీన్ టీలో ఉండే కేఫిన్, క్యాటెకిన్స్ వర్కౌట్ సమయంలో శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేయడానికి సహాయపడతాయి.

లంచ్ తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల హెవీగా ఫీల్ అవ్వడం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

సాయంత్రం జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు తాగితే ఆకలి కంట్రోల్ అవుతుంది

అనవసరంగా స్నాక్స్ తింటున్నాము అనుకున్నప్పుడు గ్రీన్ టీ తాగితే క్రేవింగ్స్ కొంతవరకు తగ్గుతాయి.

గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. పడుకునే ముందు తాగితే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నిద్ర లేకుంటే బరువు తగ్గడం కష్టమవుతుంది.

రోజుకు 2–3 కప్పులు తాగవచ్చు. ఎక్కువ తాగితే త్వరగా బరువు తగ్గుతామని అనుకోకూడదు.

గ్రీన్ టీలో షుగర్ లేదా ఎక్కువ తేనె కలిపితే అదనపు కేలరీలు చేరతాయి. అప్పుడు వెయిట్ లాస్ కష్టమవుతుంది.

డైట్ ఫాలో అవ్వకుండా, వ్యాయామం లేకుండా రోజుకు నాలుగు కప్పులు గ్రీన్ టీ తాగితే మార్పు రాదు.

ఫ్లేవర్స్, ఎక్కువ చక్కెర కలిపిన ఇన్‌స్టంట్ గ్రీన్ టీలు తాగితే ఉపయోగం ఉండదు. లూస్ లీవ్స్ లేదా మంచి బ్రాండ్ ఎంచుకుంటే మంచిది.