విటమిన్ D తగ్గితే.. సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందా?

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ D శరీరంలోని హార్మోన్ల పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తగ్గితే ఫెర్టిలిటీపై ప్రభావం పడే అవకాశం ఉంది.

కొన్ని పరిశోధనల ప్రకారం విటమిన్ D లోపం వల్ల Ovalutaion సరిగా జరగకపోవచ్చు.

PCOS ఉన్న మహిళల్లో విటమిన్ D లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది హార్మోన్ అసమతుల్యతను పెంచే అవకాశం ఉంది.

విటమిన్ D స్థాయిలు తక్కువగా ఉంటే కొందరిలో గర్భధారణ అవకాశాలు తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

విటమిన్ D లోపం వల్ల స్పెర్మ్ నాణ్యత, చలనం తగ్గే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

చాలామంది విటమిన్ D అంటే కేవలం ఎముకల ఆరోగ్యం అనుకుంటారు. కానీ ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్ పనితీరులో కూడా భాగమవుతుంది.

ఇండోర్ లైఫ్‌స్టైల్, ఎక్కువసేపు AC గదుల్లో ఉండటం వల్ల విటమిన్ D లోపం పెరుగుతోంది.

విటమిన్ D తక్కువగా ఉంటే శరీర నొప్పులు, అలసట, మూడ్ మార్పులు కనిపించొచ్చు.

గుడ్లు, ఫ్యాటీ ఫిష్, ఫోర్టిఫైడ్ పాలు వంటి ఫుడ్స్ విటమిన్ D అందించడంలో సహాయపడతాయి.

విటమిన్ D ఎక్కువైనా సమస్యలే వస్తాయి. కాబట్టి టెస్ట్ చేసి డాక్టర్ సూచనలతోనే సప్లిమెంట్స్ తీసుకోవాలి.